కేసు విచారణలో సిగిరెట్ తాగిన లాయర్ ..రూ.10వేలు జరిమానా

Gujarat Lawyer Caught Smoking, During Virtual Hearing : ధర్మాసనంలో న్యాయమూర్తి కేసు విచారిస్తుంటే న్యాయవాది ఎంత మర్యాదగా ఉండాలి? అనే విచక్షణగానీ..కనీస మర్యాదగానీ..న్యాయస్థానంపై గౌవరం కానీ లేని ఓ లాయర్ కేసు విచారణ కొనసాగుతున్న సమయంలోనే సిగిరెట్ తాగిన ఘటన గుజరాత్ లో హైకోర్టులో జరిగింది.
కరోనా కారణంగా కేసు విచారణలన్నీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతూ ఉన్నాయి. కేవలం వర్చ్యువల్ విధానంలో మాత్రమే కేసులను విచారిస్తున్న పరిస్థితి కొనసాగుతోంది. వర్చ్చవల్ హియరింగే కదానే నిర్లక్ష్యంతో హైకోర్టు అడ్వకేట్ జేవీ అజ్మెరా సెప్టెంబర్ 24న తన కారులో కూర్చుని స్టైల్ గా సిగరెట్ అంటించి గుప్పు గుప్పుమంటూ పొగ వదిలారు.
ఈ విషయాన్ని గమనించిన జస్టిస్ ఏఎస్ సుపెహియా..అడ్వకేట్ జేవీ అజ్మెరాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవాది అయి ఉండీ అజ్మెరా బాధ్యతా రాహిత్యంగా రూ. 10 వేల జరిమానా విధించారు. దీంతో అడ్వకేట్ అజ్మెరా తాజాగా కోర్టుకు క్షమాపణలు చెప్పి, జరిమానా చెల్లించారు.
కాగా గతంలో కూడా పలువురు లాయర్లు వర్చ్యువల్ విధానంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. రాజస్థాన్ లో ఒక లాయర్ సాక్షాత్తు జడ్జి ఎదుటే సీనియర్ న్యాయవాది రాజీవ్ థామన్ కెమెరాకు అడ్డంగా పేపర్ పెట్టుకుని పొగతాగిన వీడియో వైరల్ కావటంతో ఆయనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. మరో లాయర్ దర్జాగా మంచమీద పడుకుని విచారణలో పాల్గొన్నారు. మరో లాయర్ కేసు విచారణలో టీషర్ట్ వేసుకుని పాల్గొన్నారు. ఇలా న్యాయవాదులే ఇలా న్యాయస్థానం మీద ఏమాత్రం గౌవరం లేకుండా వ్యవహరించటం పరిపాటిగా మారిపోయింది.