Heavy Rains : ఉత్తరాదిని వణికిస్తున్న భారీ వర్షాలు.. వరదల్లో కొట్టుకుపోయిన వంతెనలు, రోడ్లు, రైల్వే ట్రాక్లు

ఢిల్లీలో 41 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. 1982 జులై 25 తరువాత అత్యధిక వర్షపాతం నమోదు అయింది. నాలుగు దశాబ్దాల రికార్డును బ్రేక్ చేస్తూ వర్షాలు కురుస్తున్నాయి.

Heavy Rains : ఉత్తరాదిని వణికిస్తున్న భారీ వర్షాలు.. వరదల్లో కొట్టుకుపోయిన వంతెనలు, రోడ్లు, రైల్వే ట్రాక్లు

Heavy Rains (8)

Heavy Rains Floods : భారీ వర్షాలు ఉత్తరాదిని వణికిస్తున్నాయి. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, హిమాచల్, ఉత్తరాఖండ్, జమ్మూకాశ్మీర్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు ఉత్తరాఖండ్, హిమాచల్, పంజాబ్, రాజస్థాన్ లో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లో వరద నీటిలో వంతెనలు, రోడ్లు, రైల్వే ట్రాక్లు కొట్టుకుపోయాయి. దీంతో భారీగా ఆస్తి నష్టం జరిగింది.

ఢిల్లీలో 41 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. 1982 జులై 25 తరువాత అత్యధిక వర్షపాతం నమోదు అయింది. నాలుగు దశాబ్దాల రికార్డును బ్రేక్ చేస్తూ వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీ ఎన్సీఆర్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. సెంట్రల్ ఢిల్లీ, నోయిడా, గురుగావ్ లో లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. వర్షాలతో పలు ప్రాంతాలు నీటి మునిగాయి.

Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు.. కొట్టుకుపోయిన 100 ఏళ్ల నాటి వంతెన

ఢిల్లీ ఎన్సీఆర్ లో 33 గంటల్లో 258.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది. వర్షాల ప్రభావంతో ఢిల్లీలో పాఠశాలలు మూతపడ్డాయి. భారత వావారణ శాఖ ఢిల్లీకి సోమవారం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. జులై 15 వరకు తేలికపాటి వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

శనివారం ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల మధ్య 153 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది. పగలు, రాత్రి నిర్విరామంగా వర్షం కురుస్తోంది. ఆదివారం సాయంత్రం 5:30 గంటల వరకు లోధి రోడ్ ప్రాంతంలో గరిష్టంగా 116.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. ఢిల్లీలో భారీ వర్షాల పట్ల ఆప్ ప్రభుత్వం అప్రమత్తమైంది.

Telangana Rains : రానున్న ఐదు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

లోతట్టు, సమస్యాత్మక ప్రాంతాల్లో సమస్యలను ఆప్ మంత్రులు, మేయర్ శైలి ఒబెరాయ్ పరిశీలించి పరిష్కరిస్తున్నారు. ఢిల్లీ యమునా నదిలో వరద ప్రవాహం పెరుగుతోంది. హర్యానా హతిని కుండ్ బ్యారేజి నుంచి లక్ష క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో యమునా నదిలో నీటిమట్టం పెరిగింది. యమునా నది పరివాహక ప్రాంతాలకు ఢిల్లీ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.