హృదయవిదారకం.. వైద్యం అందక ఆసుపత్రి బయట భార్య ఒడిలోనే భర్త మృతి

మహారాష్ట్రలో కరోనా రోగుల పరిస్థితి దయనీయంగా ఉంది. ప్రాణవాయువే(ఆక్సిజన్) కాదు.. కనీస వైద్యం అందక రోగుల ప్రాణాలు పోతున్నాయి. మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో కొవిడ్‌ కేసులు బయటపడుతుండటంతో ఆస్పత్రులన్నీ నిండిపోయాయి. దీంతో వైరస్‌ బారిన పడి పరిస్థితి తీవ్రంగా ఉన్నవారికి వైద్యం అందక ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోతున్నాయి. అలాంటి ఘటనే నాసిక్‌ జిల్లా చాంద్వాడ్‌లో చోటుచేసుకుంది. కరోనా సోకిన అరుణ్‌ మాలి అనే వ్యక్తిని అతడి భార్య ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చింది.

హృదయవిదారకం.. వైద్యం అందక ఆసుపత్రి బయట భార్య ఒడిలోనే భర్త మృతి

Husband Dies Infront Of Wife Due To Lack Of Treatment

Updated On : April 22, 2021 / 3:27 PM IST

husband dies wife lack of treatment coronavirus covid19 oxygen:మహారాష్ట్రలో కరోనా రోగుల పరిస్థితి దయనీయంగా ఉంది. ప్రాణవాయువే(ఆక్సిజన్) కాదు.. కనీస వైద్యం అందక రోగుల ప్రాణాలు పోతున్నాయి. మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో కొవిడ్‌ కేసులు బయటపడుతుండటంతో ఆస్పత్రులన్నీ నిండిపోయాయి. దీంతో వైరస్‌ బారిన పడి పరిస్థితి తీవ్రంగా ఉన్నవారికి వైద్యం అందక ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోతున్నాయి. అలాంటి ఘటనే నాసిక్‌ జిల్లా చాంద్వాడ్‌లో చోటుచేసుకుంది. కరోనా సోకిన అరుణ్‌ మాలి అనే వ్యక్తిని అతడి భార్య ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చింది.

అయితే ఆస్పత్రిలో బెడ్లు ఖాళీగా లేవని సిబ్బంది అతడిని చేర్చుకోలేదు. ఇంతలో అరుణ్ కి ఊపిరి తీసుకోవడం కూడా కష్టం మారింది. కనీసం ఆక్సిజన్‌ అయినా పెట్టాలని భార్య ఆసుపత్రి సిబ్బందిని వేడుకుంది. వైద్య సిబ్బంది స్పందించేలోపే తన భార్య ఒడిలోనే భర్త అరుణ్ కన్నుమూశాడు. కళ్లముందే భర్త ప్రాణాలు పోతుంటే, కాపాడుకోలేని దుస్థితిలో భార్య ఉంది. తన భర్త ఇక లేడనే వార్తను ఆమె జీర్ణించుకోలేకపోయింది. కన్నీరుమున్నీరుగా విలపించింది. ఈ దృశ్యం స్థానికులను కంటతడి పెట్టించింది. అందరిని ఎంతగానో బాధించింది.

అందుకే కరోనాతో జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం కచ్చితంగా పాటించాలని చెబుతున్నారు. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు.