మహారాష్ట్రలో లాక్ డౌన్ ని తోసిపుచ్చలేం..సీఎం ఉద్దవ్ ఠాక్రే
మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రస్తుతం ఉన్నట్లుగానే కొనసాగితే లాక్డౌన్ను తోసిపుచ్చలేమని సీఎం ఉద్ధవ్ ఠాక్రే అన్నారు.

I Cannot Rule Out Imposing A Lockdown Maharashtra Cm Uddhav Thackeray
Uddhav Thackeray మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రస్తుతం ఉన్నట్లుగానే కొనసాగితే లాక్డౌన్ను తోసిపుచ్చలేమని సీఎం ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి తీవ్రతరమవుతున్న నేపథ్యంలో శుక్రవారం రాత్రి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన సీఎం ఉద్దవ్ ఠాక్రే..రానున్న రోజుల్లో మహారాష్ట్రలో రోజుకు 2.5 లక్షల ఆర్టీ పీసీఆర్ టెస్టులు చేయనున్నట్లు చెప్పారు.
ఇప్పటివరకు రాష్ట్రంలో 65 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు పేర్కొన్న సీఎం.. గురువారం ఒక్కరోజే 3 లక్షల మందికి వ్యాక్సిన్ వేసినట్లు తెలిపారు. మాస్క్ ధరించే విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్న వారికి టీకా తీసుకున్నాక కూడా వైరస్ సోకుతుందని అన్నారు.
కేసుల సంఖ్య పెరుగుతూ ఉంటే, రాబోయే 15-20 రోజుల్లో ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల(హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్) కొరత ఉండవచ్చని ఉద్దవ్ తెలిపారు. కరోనా వైరస్ ని అరికట్టడానికి రానున్న కొన్ని రోజుల్లో కఠినమైన ఆంక్షలు అమలు చేయబడతాయన్నారు.