Karnataka CM : నాకేమీ తెలియదు..సీఎం మార్పుపై యడియూరప్ప కీలక వ్యాఖ్యలు

కర్ణాటక ప్రభుత్వంలో నాయకత్వం మార్పు మరియు కేబినెట్ విస్తరణపై ఊహాగానాలు వినిపిస్తున్న సమయంలో శుక్రవారం(జులై-16,2021) సీఎం యడియూరప్ప ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు.

Karnataka CM : నాకేమీ తెలియదు..సీఎం మార్పుపై యడియూరప్ప కీలక వ్యాఖ్యలు

Pm Modi (1)

Updated On : July 16, 2021 / 9:58 PM IST

Karnataka CM కర్ణాటక ప్రభుత్వంలో నాయకత్వం మార్పు మరియు కేబినెట్ విస్తరణపై ఊహాగానాలు వినిపిస్తున్న సమయంలో శుక్రవారం(జులై-16,2021) సీఎం యడియూరప్ప ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు. అయితు సొంత పార్టీ(కర్ణాటక బీజేపీ యూనిట్)లో అసమ్మతి ఎదుర్కొంటున్న యడియూరప్ప..ప్రధాని మోదీని కలిసిన అనంతరం కర్ణాటకలో నాయకత్వ మార్పు గురించి విలేఖరులు అడిగిన ప్రశ్నలన్నింటిని తోసిపుచ్చారు.

కర్ణాటకలో నాయకత్వ మార్పు ఉంటుందంటూ వస్తున్న రిపోర్ట్ లపై యడియూరప్పని విలేఖరులు ప్రశ్నించగా…సీఎం మార్పు గురించి నాకేమీ తెలియదు. మీరే చెప్పాలంటూ అక్కడున్న విలేఖరులతో యడియూరప్ప అన్నారు. కర్ణాటకలో అభివృద్ధి పనుల అమలు వేగవంతం సాయం చేయమని కోరేందుకే తాను ప్రధాని మోదీని కలిసినట్లు చెప్పారు. కేబినెట్ విస్తరణపై అడిగిన ప్రశ్నకు.. పార్టీ సీనియర్లతో ఈ విషయమై ఏదైనా చర్చ జరిగినప్పుడు మీకు తెలియజేస్తా అని సమాధానమిచ్చారు సీఎం.

మరోవైపు,ఇటీవల కేంద్ర కేబినెట్ విస్తరణలో చోటు దక్కించుకున్న కర్ణాటక ఎంపీ శోభా కరంద్లాజే సహా పలువురు మంత్రులను శుక్రవారం యడియూరప్ప కలిశారు.