ద్వైపాక్షిక ఒప్పందాలకు అనుగుణంగానే భారత్-చైనా బోర్డర్ వివాదం పరిష్కారం

లడఖ్ సరిహద్దులోని పాంగోంగ్ తిసో మరియు గాల్వన్ వ్యాలీ ప్రాంతాలలో భారతదేశం-చైనాదేశాల మధ్య నెలకొన్ని ప్రతిష్టంభన శాంతియుతంగా పరిష్కరించబడుతుందని కేంద్ర విదేశాంగశాఖ ప్రకటించింది. ఇరు దేశాల మధ్య ఉన్న వివిధ ద్వైపాక్షిక ఒప్పందాలకు అనుగుణంగా సరిహద్దు సమస్య శాంతియుతంగా పరిష్కరించబుతుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది.
శనివారం(జూన్-6,2020)లఢఖ్ లోని చుషుల్-మోల్డో ప్రాంతంలో భారత ఆర్మీకి చెందిన 14 కార్ప్స్ కమాండర్ మరియు ఆయన చైనా కౌంటర్ పార్ట్(సమాన హోదా కలిగిన వ్యక్తి)మధ్య హై లెవల్ మీటింగ్ జరిగిన తర్వాత ఇవాళ విదేశాంగ శాఖ ఈ ప్రకటన విడుదల చేసింది.
సుహృద్భావ మరియు సానుకూల వాతావరణంలో హై లెవల్ మీటింగ్ శనివారం జరిగిందని, బోర్డర్ లో ఏరియాల్లో పరిస్థితిని వివిధ ద్వైపాక్షిక ఒప్పందాలకు అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. ద్వైపాక్షిక సంబంధాల సమగ్ర అభివృద్ధి కొరకు ఇండియా-చైనా బోర్డర్ ప్రాంతాల్లో శాంతి మరియు ప్రశాంతత అవసరమని నాయకుల మధ్య ఉన్న ఒప్పందాన్ని దృష్టిలో ఉంచుకుని సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు రెండు దేశాలు అంగీకరించాయని విదేశీ మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
మే నెల ప్రారంభంలో చైనా ఆర్మీ..లఢఖ్ లోని భారత భూభాగంలోని మూడు ప్రాంతాల్లోకి అక్రమంగా ప్రవేశించి టెంట్ లు,పోస్ట్ లను ఏర్పాటు చేసింది. భారత ఆర్మీ ఎన్ని హెచ్చరికలు చేసినా చైనా ఆర్మీ పట్టించుకోకుండా భారత భూభగంలోనే ఉండింది. దీంతో ఇరు దేశాల సైనికుల మధ్య రాళ్లు విసురుకోవడం,ఫైటింగ్ మొదలైన విషయం తెలిసిందే. తూర్పు లఢఖ్ లో భారత్, చైనాకి చెందిన 250 మంది సైనికులు కొట్టుకున్నారు. పరస్పరం రాళ్లు విసురుకున్నారు. ఈ గొడవలో రెండువైపులా 100 సైనికులు గాయపడ్డారు. ఆ తర్వాతి రోజు రెండు వైపులా కమాండర్లు మాట్లాడుకోవడం ద్వారా మేటర్ సెటిలైంది. 4 రోజుల తర్వాత ఉత్తర సిక్కింలో నాథులా పాస్ దగ్గర మరోసారి గొడవ జరిగింది. ఆ ఘటనలో రెండువైపులా 10 మంది సైనికులు గాయపడ్డారు.
ఆ తర్వాత చైానా… తూర్పు లఢక్ దగ్గర వాస్తవాధీన రేఖ వెంట 5000 బలగాల్ని వేర్వేరు లొకేషన్లలో మోహరించింది. పాంగ్యాంగ్ సరస్సు, గల్వాన్ లోయ సమీపంలో తాత్కాలిక నిర్మాణాలు చేపట్టింది. ఇది గమనించిన ఇండియా కూడా భారీగా సైన్యాన్ని మోహరించింది. ఇలా పోటా పోటీగా సైన్యాలను మోహరించడంతో సరిహద్దుల్లో అసలేం జరుగుతోందనని అంతటా ఉత్కంఠ నెలకొంది.లఢఖ్,సిక్కింలలోని LAC(వాస్తవాధీన రేఖ)చుట్టూ చైనా మిలటరీ తమ ట్రూప్స్ తో సాధారణ పాట్రోలింగ్ ను అవరోధంగా లేదా ప్రతిబంధకముగా మారుస్తుందని భారత్ తెలిపింది.