7లక్షలకు దాటిన కరోనా కేసుల సంఖ్య..

ఇటీవల నమోదైన 25వేల ఫ్రెష్ కేసులు, 600 మృతులతో కలిపి మరో రికార్డు నెలకొల్పింది కరోనా వైరస్. దేశవ్యాప్తంగా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ లెక్కల ప్రకారం.. మరిన్ని కరోనా కేసులు, మృతులు నమోదయ్యాయి. హెల్త్ మినిస్ట్రీ సమాచారం ప్రకారం.. COVID-19 ఒక్కరోజులో 24వేల 850కేసులు నమోదయ్యాయి. అందులో 613 మృతులు ఉన్నాయి.
మొత్తం 6లక్షల 73వేల 165కేసులు నమోదుకాగా అందులో 4లక్షల 9వేల 83మంది రికవరీ అయ్యారు. అందులో 2లక్షల 44వేల 814మంది యాక్టివ్ గా ఉన్నారు. వీరిలో 19వేల 268 మంది కరోనాతో పాటు ఇతర జబ్బులు సంభవించి ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్ర దేశంలోనే కరోనాతో ఎఫెక్ట్ అయిన పెద్ద రాష్ట్రంగా నిలిచిపోయింది. దేశంలో 2లక్షల కంటే ఎక్కువ కేసులు నమోదైన రాష్ట్రమిదే.
మహారాష్ట్రలో నమోదైన 2లక్షల కంటే ఎక్కువ కేసుల్లో లక్ష మంది రికవరీ కాగా 8వేల 671మంది చనిపోయారు.