కోలుకుంటున్న భారత్…ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో రికవరీలు

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. వైరస్ కేసుల సంఖ్య 55 లక్షలు దాటింది. ఇక గడచిన 24 గంటలలో కొత్తగా 75,083 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ మేరకు మంగళవారం హెల్త్ బుటిటెన్ విడుదల చేసింది.
గడిచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 1,01,468 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 80.12 శాతంగా ఉంది. దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసులు 18.28 శాతంగా ఉన్నాయి. దేశంలో మొత్తం నమోదయిన కేసుల్లో మరణాల రేటు 1.60 శాతానికి తగ్గింది. గడచిన 24 గంటలలో 9,33,185 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. దేశంలో ఇప్పటి వరకు చేసిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 6,53,25,779గా ఉంది.
కాగా , దేశవ్యాప్తంగా వైరస్ బారినపడి ఇప్పటివరకు సుమారు 44.9 లక్షల మంది కోలుకోగా 9.7 లక్షల మంది చికిత్స పొందుతున్నారు. కోవిడ్ వల్ల దేశంలో మొత్తం 88,935 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
కరోనాతో తీవ్ర ప్రభావితమైన రాష్ట్రాల్లో మహారాష్ట్ర ముందు వరుసలో ఉంది. ఈ రాష్ట్రంలో 2.9 లక్షల యాక్టివ్ కేసులున్నాయి. 98వేల యాక్టివ్ కేసులతో కర్ణాటక తరువాతి స్థానంలో ఉండగా 78 వేల కేసులతో ఏపీ తరువాతి స్థానంలో ఉంది.