Corona Cases : భారత్ లో కరోనా తగ్గుముఖం.. 6 వేల లోపే రోజువారీ కేసులు

దేశంలో ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,29,62,953కు చేరింది. వీటిలో 4,23,88,475 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 5,15,036 మంది కరోనాతో మరణించారు.

Corona Cases : భారత్ లో కరోనా తగ్గుముఖం.. 6 వేల లోపే రోజువారీ కేసులు

India Corona

Updated On : March 6, 2022 / 5:30 PM IST

corona new cases : భారత్ లో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయి. కొన్ని రోజులుగా 6 వేల లోపే రోజువారీ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కొత్తగా 5,476 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 158 మంది కరోనా సోకి మరణించారు. కరోనా బారిన పడిన 9754 మంది కోలుకున్నారు.

దేశంలో ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,29,62,953కు చేరింది. వీటిలో 4,23,88,475 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 5,15,036 మంది కరోనాతో మరణించారు. 59,442 మంది బాధితులు వివిధ ఆస్పత్రల్లో చికిత్స పొందుతున్నారు.

Covid-19 Fourth Wave: జూన్ లో కరోనా నాలుగో వేవ్ ఉంటుందన్న ఐఐటీ కాన్పూర్ అధ్యయనం

దేశంలో ప్రస్తుతం 0.14 శాతం యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 98.66 శాతం మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,78,83,79,249 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని పేర్కొంది.