Russia Ukraine Crisis : రంగంలోకి బాహుబలి యుధ్ధవిమానం సీ-17
ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులను తరలించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎయిర్‌ఫోర్స్ సాయాన్నికోరారు. ప్రధాని ఆదేశాల నేపథ్యంలో ఎయిర్‌ఫోర్స్ సి-17 విమానాల్ని రంగంలోకి దించింది.

Russia Ukraine Crisis
Russia Ukraine Crisis : ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులను తరలించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎయిర్‌ఫోర్స్ సాయాన్నికోరారు. ప్రధాని ఆదేశాల నేపథ్యంలో ఎయిర్‌ఫోర్స్ సి-17 విమానాల్ని రంగంలోకి దించింది.
కీవ్‌లో ఏదో జరగబోతోంది..! రష్యా సైన్యం కీవ్‌ను చుట్టుముట్టింది..! కీవ్‌పైకి రష్యా బలగాలు భారీగా దూసుకొస్తోన్నాయి..! కీవ్ సరిహద్దుల్లోకి రష్యా సైన్యం చేరుకుంది. 64 కిలోమీటర్ల మేర రష్యా సైనిక వాహనాలు బారులు తీరాయి. దీంతో కీవ్‌పై భారీగా దాడులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే కీవ్‌లో ఉండడం ఏమాత్రం సురక్షితం కాదని భారత ప్రభుత్వం భావిస్తోంది. అందుకే తక్షణమే కీవ్‌ను వీడాలని ఆదేశించింది. అందుబాటులో ఉన్న రైళ్లు, ఇతర మార్గాల ద్వారా యుక్రెయిన్ సరిహద్దులకు చేరుకోవాలని సూచించింది.
ఉక్రెయిన్‌లో పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. ఉక్రెయిన్ పౌరుల్ని సైతం రష్యా దళాలు లక్ష్యంగా చేసుకోవడంతో ఏ క్షణంలో ఏం జరుగుతోందనన్న భయానక వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఉక్రెయిన్ రాజధాని కీవ్ నుంచి భారతీయులు అందరూ వెంటనే ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవాలని భారత రాయబార కార్యాలయం సూచన జారీ చేసింది. భారతీయ విద్యార్థులు, భారత జాతీయులు అందరూ రైళ్లు లేదా ఇతర మార్గాల్లో ఈ రోజే కీవ్‌ను వీడాలని కోరింది.
మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ.. ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు కార్యక్రమంలో పాల్గొనాలంటూ ఎయిర్‌ఫోర్స్ సాయాన్ని కోరారు. ఉక్రెయిన్‌లో సుమారు 10 వేల మంది భారతీయులు ఉంటారని అంచనా. ఇప్పటికి నాలుగు వేలమంది వెనక్కి వచ్చేసి ఉంటారని భావిస్తున్నారు. ఎయిరిండియా ఒక్కటే విమానాల ద్వారా భారతీయుల్ని తీసుకువస్తోంది. దీంతో తరలింపును మరింత వేగవంతం చేసేందుకు ఎయిర్‌ఫోర్స్ సాయాన్ని కోరారు ప్రధాని మోదీ. ప్రధాని ఆదేశాల నేపథ్యంలో ఎయిర్‌ఫోర్స్ సి-17 విమానాల్ని రంగంలోకి దించింది.
సీ-17 బాహుబలి యుధ్ధ విమానం ప్రత్యేకతలు
సి-17 యుద్ధ విమానాల సామర్థ్యం అధికంగా ఉంటుంది. దాంతో తక్కువ సమయంలోనే ఎక్కువ మందిని చేరవేయడం సాధ్యమవుతుంది. సి-17 యుద్ధ విమానంలో కనీసం ఒక ట్రిప్పులో సుమారు 340 మందిని తీసుకురావొచ్చు. సి-17 విమానం గంటకు 950 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.
యుద్ధ సమయాల్లో విదేశాల్లో చిక్కుకున్న మన వాళ్లను కాపాడేందుకు భారత ప్రభుత్వం ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీలతో కలిసి చాలాసార్లు ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించింది. క్షణక్షణానికి మారిపోయే పరిస్థితుల కారణంగా టైమ్‌కు తగ్గ నిర్ణయాలు తీసుకుంటూ ఎందరి ప్రాణాలనో కాపాడింది ఇండియా. మరోసారి అలాంటి అవసరం ఏర్పడింది. దీంతో ఈసారి భారత్ అమ్ములపొదిలోని సీ-17 అస్త్రాని బయటకు తీసింది.
రష్యా-యుక్రెయిన్ యుద్ధం కారణంగా యుక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను తీసుకొచ్చేందుకు సీ-17 విమానాన్ని ఉపయోగించనుంది భారత్. ఇప్పటికే ‘ఆపరేషన్ గంగ’ పేరుతో భారతీయ విద్యార్థులను ఎయిర్ లిఫ్ట్ చేస్తుండగా… తాజాగా ఆపరేషన్ గంగను మరింత వేగం చేసేలా కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుంచి భారత వాయుసేన విమానం రంగంలోకి దిగనుంది.
తక్కువ సమయంలో ఎక్కువ మందిని తీసుకువచ్చేందుకు వీలుగా భారతీయ వాయుసేన సీ-17 విమానాన్ని ఉపయోగించనుంది. భారత ప్రధాని మోదీ పిలుపు మేరకు భారత వాయుసేన కూడా ఆపరేషన్ గంగలో పాలుపంచుకోనుంది. అయితే ఇంతకీ ఈ సీ-17 ప్రత్యేకతలేంటి..? ఇందులో ఎంతమంది ప్రయాణించవచ్చు?
సి-17 గ్లోబ్‌మాస్టర్-3గా పిలిచే ఈ విమానానికి నాలుగు ఇంజన్లు ఉంటాయి. 1980లలో తయారై, 1990ల నుంచి రవాణాలో పాల్గొంటున్న ఈ విమానాన్ని ప్రమాదంలో ఉన్న వ్యక్తులను ఒక చోటు నుంచి మరో చోటుకు తరలించేందుకు ఉపయోగిస్తుంటారు. ఇండియా, బ్రిటన్‌లతోపాటు అమెరికా కూడా ఈ సి-17 విమానాన్ని ఉపయోగిస్తోంది. ప్రస్తుతం భారత వైమానిక దళంలో సి-17 గ్లోబ్‌మాస్టర్ 3 తరహా 11 విమానాలు వినియోగంలో ఉన్నాయి. సహాయక చర్యల కోసం భారత వైమానిక దళం తరచుగా ఈ విమానాన్ని ఉపయోగిస్తుంది.
కరోనా వైరస్ సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ కొరత ఏర్పడినప్పుడు ఆక్సిజన్ ట్యాంకర్లను ఒక చోట నుంచి మరొక చోటకు తరలించడానికి కూడా ఈ విమానం చాలా ఉపయోగపడింది. ఈ విమానాన్ని 77 టన్నుల బరువును మోసుకెళ్లేలా రూపొందించారు. ఇక సీ-17 విమానం గంటకు 950 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.
Also Read : Indian Student: యుక్రెయిన్‌లో ఇండియన్ స్టూడెంట్ మృతి
సాయుధ వాహనాలు, ట్రక్కులు, యుద్ధట్యాంక్‌లను కూడా ఈ విమానంలో తీసుకెళ్లవచ్చు. ఇక సీ-17 యుద్ధ విమానం ఒకటి కనీసం 340 మందిని తీసుకురాగలదు. అదే ఎయిర్ ఇండియా విమానం అయితే 200 నుంచి 240 మధ్యే ఒక ట్రిప్‌లో తీసుకు రాగలదు. అందుకే యుక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను ఈ విమానం ద్వారా తీసుకురావలని కేంద్రం డిసైడ్ అయింది. ప్రస్తుతం యుక్రెయిన్‌లో 12వేల మంది వరకు భారతీయులు ఉంటారని అంచనా..!