ఆపరేషన్ సిందూర్.. 100 మంది ఉగ్రవాదులు ఖతం.. !

పహల్గాం ఉగ్రదాడికి భారత ఆర్మీ ప్రతీకారం తీర్చుకుంటోంది. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రస్థావరాలే టార్గెట్ గా ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులకు పాల్పడింది.

ఆపరేషన్ సిందూర్.. 100 మంది ఉగ్రవాదులు ఖతం.. !

Operation Sindoor

Updated On : May 7, 2025 / 2:44 PM IST

Operation Sindoor: పహల్గాం ఉగ్రదాడికి భారత ఆర్మీ ప్రతీకారం తీర్చుకుంటోంది. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రస్థావరాలే టార్గెట్ గా ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులకు పాల్పడింది. భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడులు నిర్వహించాయి. మిసైళ్లతో లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లో పాకిస్థాన్ లోని నాలుగు, పీవోకేలో ఐదు చోట్ల భారత్ సైన్యం అటాక్ చేసింది. తద్వారా ఉగ్రవాదులకు, వారికి సహకరిస్తున్న పాకిస్థాన్ ప్రభుత్వానికి దిమ్మతిరిగే షాకిచ్చింది.

Also Read: Operation Sindoor: ‘ఆపరేషన్‌ సిందూర్‌’పై చంద్రబాబు, రేవంత్, జగన్, బండి సంజయ్ సహా ప్రముఖులు స్పందన ఇదే..

భారత్ సైన్యం నిర్వహించిన మెరుపుదాడుల్లో ముంబై దాడులు సూత్రధారి, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయూద్ కంచుకోట మురిడ్కే కూడా ఉంది. జైషే మహ్మద్, లష్కరే ఉగ్రసంస్థల టాప్ లీడర్స్ లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్ ను ఇండియన్ ఆర్మీ చేపట్టింది. ముజఫరాబాద్ లోని రెండు ప్రాంతాలు, కోట్లీ, గుల్‌పూర్, బింబార్, సియాల్ కోట్, చక్రంబూ, మురిడ్కే, బహావల్‌పూర్‌ లోని ఉగ్రస్థావరాలపై ఇండియన్ ఆర్మీ దాడులు నిర్వహించింది. ఈ తొమ్మిది ప్రాంతాల్లోని ఉగ్ర స్థావరాలపై ఎనిమిది కిలో మీటర్ల నుంచి 100 కిలో మీటర్ల రేంజ్ లో మిసైళ్ల వర్సం కురిపించింది.

Also Read: Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’.. పాక్ ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు..

♦ మురిడ్కే ప్రాంతంలో లష్కరే తోయిబా హెడ్ క్వార్టర్ ఉంది. ఆ ప్రాంతంలో ఇండియన్ ఆర్మీ మిసైళ్లతో విరుచుకుపడింది.
♦ బహావల్ పూర్ ప్రాంతంలో జైషే-ఎ-మహమ్మద్ హెడ్ క్వార్టర్ ఉంది. ఈ ప్రాంతంపై కూడా భారత ఆర్మీ మిసైళ్ల వర్షం కురిపించింది.
♦ ముజఫరాబాద్ పీవోకేకి హెడ్ క్వార్టర్. ఇక్కడ హిజ్బుల్ ముజాహిదీన్ బేస్ ఉంది. ముజఫరాబాద్ లో రెండు ప్రాంతాలను ఇండియన్ ఆర్మీ టార్గెట్ చేసింది. అక్కడి ఉగ్రవాద స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది.
♦ కోట్లీ ప్రాంతంలో ఉగ్రవాద శిబిరాలపైనా ఇండియన్ ఆర్మీ మెరుపుదాడులు చేసింది.
♦ ముజఫరాబాద్ లో మరోచోట మిసైళ్లతో దాడిచేసిన భారత ఆర్మీ.. గుల్‌పూర్ ప్రాంతం, సియాల్ కోట్, చాక్అమ్రూ, బహావల్ పూర్, బింబార్ ప్రాంతాల్లోని ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులు చేసింది.


ఇండియన్ ఆర్మీ దాడులు చేసిన కాసేపటికే సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. పాక్ పౌరులు ఈ దాడులను తమ ఫోన్లలో రికార్డు చేసి ట్విటర్ లో పోస్టు చేశారు. ఈ దాడుల్లో మొత్తం 80 నుంచి 100 మంది వరకు ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం. మరోవైపు భారత ఆర్మీ ఉగ్రవాద స్థావరాలపై మిసైళ్ల దాడి చేయడంతో భారతదేశంలోని ప్రజలు హర్షాతిరేఖాలు వ్యక్తం చేస్తున్నారు. టపాసులు పేల్చి సంబరాలు చేసుకుంటున్నారు.