Operation Sindoor: రాఫెల్ అంటే అట్లుంటది మరి.. పాక్ పై దాడిలో వాడిన స్కాల్ప్ క్షిపణులు, హామర్ బాంబుల స్పెషాలిటీ ఇదే..
‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో నిర్వహించిన ఈ దాడుల్లో భారత ఆర్మీ రాఫెల్ జెట్లను ఉపయోగించింది. రాఫెల్ జెట్‌లు అత్యంత తక్కువ ఎత్తులో ఎగురుతూ..

Image Credit : MBDA
Operation Sindoor: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అత్యంత ఆధునిక రాఫెల్ యుద్ధ విమానాలను ఉపయోగించి, పాకిస్తాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లోని ఉగ్రవాద శిబిరాలపై ఖచ్చితమైన దాడులు నిర్వహించింది. ఈ ఆపరేషన్‌కు “ఆపరేషన్ సిందూర్” అని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పేరు పెట్టారు. ఈ దాడులలో భారత్ ఫ్రాన్స్ నుండి కొనుగోలు చేసిన స్కాల్ప్ క్షిపణులు, హామర్ బాంబులను ఉపయోగించింది. ఈ ఆయుధాలు సుదీర్ఘ దూరంలో ఉన్న లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ధ్వంసం చేయగలవు.
Also Read: Operation Sindoor : ‘ఆపరేషన్ సిందూర్’ పై క్రికెటర్లపై స్పందన ఇదే..
మంగళవారం అర్థరాత్రి తరువాత భారత ఆర్మీ ఈ ఎటాక్స్ చేసింది. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద సంస్థలైన జైష్-ఎ-మహమ్మద్, లష్కర్-ఎ-తొయిబా శిబిరాలు టార్గెట్ గా దాడులు జరిగాయి. ఈ శిబిరాలు భారత్‌పై ఉగ్రవాద దాడులను ప్లాన్ చేస్తున్నట్లు గుర్తించిన ఇంటెలిజెన్స్ రిపోర్టుల ఆధారంగా ఈ ఆపరేషన్ చేపట్టింది.
‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో నిర్వహించిన ఈ దాడుల్లో భారత ఆర్మీ రాఫెల్ జెట్లను ఉపయోగించింది. రాఫెల్ జెట్‌లు అత్యంత తక్కువ ఎత్తులో ఎగురుతూ, శత్రు రాడార్‌లను తప్పించి, లక్ష్యాలను విజయవంతంగా ధ్వంసం చేశాయి. స్కాల్ప్ క్షిపణులు 300 కిలోమీటర్ల దూరం వరకు లక్ష్యాలను చేరుకోగలవు, అయితే హామర్ బాంబులు 70 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కచ్చితంగా నాశనం చేయగలవు.
ఈ దాడులు భారత సైనిక శక్తిని, ఉగ్రవాదంపై దృఢమైన వైఖరిని ప్రదర్శించాయి. 2019లో బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ తర్వాత, ఇది పాకిస్తాన్‌లోని ఉగ్రవాద లక్ష్యాలపై భారత్ చేపట్టిన మరో ముఖ్యమైన ఆపరేషన్‌గా చరిత్రకెక్కింది. ఈ ఆపరేషన్ ద్వారా భారత్… పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టమైన సందేశం పంపింది. రాఫెల్ జెట్‌లు అత్యాధునిక ఆయుధాల వినియోగం భారత వాయుసేన సాంకేతిక పరిజ్ఞానం, యుద్ధ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటింది.
గగ్గోలు పెడుతున్న పాకిస్తాన్..
ఉగ్రస్థావరాలపై భారత్ దాడులను పాకిస్తాన్ ఖండించింది. దీనిని తమ దేశ సార్వభౌమత్వంపై దాడిగా అభివర్ణించింది. అయితే, భారత్ ఈ ఆపరేషన్‌ను తమ దేశ భద్రత కోసం అవసరమైన చర్యగా సమర్థించింది. అంతర్జాతీయ సమాజంలో మెజారిటీ దేశాలు భారత్ దాడికి మద్దతు ఇచ్చాయి, మరికొన్ని దేశాలు ఈ విషయంలో తటస్థ వైఖరిని అవలంభించాయి.
అయితే, ‘ఆపరేషన్ సిందూర్’ భారత్ రక్షణ వ్యూహంలో ఒక మైలురాయిగా నిలిచింది. ఈ ఆపరేషన్ ద్వారా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సామర్థ్యం స్పష్టమైంది.
Graphic representation of the targets taken by the Indian Armed Forces under #OperationSindoor in Pakistan and PoJK https://t.co/cEasBn51U9 pic.twitter.com/HMONRGQxWW
— ANI (@ANI) May 7, 2025