KKR Vs RCB : ఐపీఎల్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. స్కానింగ్‌లో బయటపడిన షాకింగ్ విషయం
ఐపీఎల్‌కు సైతం కరోనా సెగ తగిలింది. ఇద్దరు ప్లేయర్లు కోవిడ్ బారిన పడ్డారు. దీంతో నేడు(మే 3,2021) జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడింది. రాత్రి 7.30 గంటలకు ఆర్సీబీ, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ క్రమంలో కరోనా పరీక్షలు నిర్వహించగా కోల్‌కతా ఆటగాళ్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్‌కు వైరస్ సోకినట్లు తేలింది. అదే విధంగా జట్టులోని ఇతర ఆటగాళ్లు కూడా స్వల్ప

Kkr Vs Rcb
KKR Vs RCB Match Postponed : ఐపీఎల్‌కు సైతం కరోనా సెగ తగిలింది. ఇద్దరు ప్లేయర్లు కోవిడ్ బారిన పడ్డారు. దీంతో నేడు(మే 3,2021) జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడింది. రాత్రి 7.30 గంటలకు ఆర్సీబీ, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ క్రమంలో కరోనా పరీక్షలు నిర్వహించగా కోల్‌కతా ఆటగాళ్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్‌కు వైరస్ సోకినట్లు తేలింది. అదే విధంగా జట్టులోని ఇతర ఆటగాళ్లు కూడా స్వల్ప అస్వస్థతకు గురైనట్లు సమాచారం. దీంతో, టీం మొత్తం ఐసోలేషన్‌లోకి వెళ్లింది. ఈ నేపథ్యంలో సోమవారం నాటి మ్యాచ్‌ను వాయిదా వేశారు.
సోమవారం జరగాల్సిన మ్యాచ్ సంఖ్య 30. అహ్మదాబాద్ వేదిక. దీనిని రీషెడ్యూల్ చేయనున్నారు. వాస్తవంగా వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ గాయపడ్డారు. వారిని స్కానింగ్ కోసం ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది. కాగా ఇక నుంచి కోల్‌కతా శిబిరంలోని ఆటగాళ్లకు ప్రతి రోజూ ఆర్‌టీపీసీఆర్ టెస్టులు చేయనున్నారు. ఆ ఇద్దరితో 48 గంటల క్రితం సన్నిహితంగా మెలిగిన వారి నమూనాలను పరీక్షించనున్నారు. ప్రస్తుతానికైతే మిగతావారికి నెగెటివ్ వచ్చిందని ఐపీఎల్ కౌన్సిల్ తెలిపింది. ఆ ఇద్దరు ఆటగాళ్ల నుంచి ఇంకెవరికైనా వైరస్ సోకితే లీగ్ నిర్వహణ కష్టమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కాగా, భారత్ లో కరోనా విలయం కొనసాగుతోంది. రోజువారీ కరోనా కేసులు మూడున్నర లక్షలకు పైగా నమోదవుతున్నాయి. వేల సంఖ్యలో మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్‌ను వీడి స్వదేశాలకు వెళ్లిపోయారు. మరికొందరు బయో బబుల్‌లో ఉండలేక లీగ్ నుంచి వైదొలిగారు. అత్యంత జాగ్రత్తల నడుమ బయో బబుల్ వాతావరణంలో టోర్నీ నిర్వహిస్తున్నప్పటికీ ఇద్దరు ఆటగాళ్లు కరోనా బారిన పడటం ప్లేయర్స్ లో ఆందోళన నింపింది.