ఎకో ఫ్రెండ్లీ శానిటరీ ప్యాడ్స్ తయారు చేస్తున్న18 ఏళ్ల అమ్మాయి

  • Published By: veegamteam ,Published On : November 13, 2019 / 07:30 AM IST
ఎకో ఫ్రెండ్లీ శానిటరీ ప్యాడ్స్ తయారు చేస్తున్న18 ఏళ్ల అమ్మాయి

Updated On : November 13, 2019 / 7:30 AM IST

వ్యాపారం చేయటానికి లక్షల రూపాయలు పెట్టుబడులే అక్కర్లేదు. పెద్ద పెద్ద సంస్థలు స్థాపించక్కర్లేదు. కొత్తగా ఆలోచించాలి..తాము చేసే వ్యాపారం వల్ల నలుగురికి ఉపయోగపడాలి. దానికి ఓర్పు..నేర్పు..అంకింత భావం..సృజనాత్మకత  ఉంటే చాలు..వ్యాపారం చిన్నదైనా పలువురి మెప్పు పొందవచ్చని నిరూపించింది ఓ 18 సంవత్సరాల అమ్మాయి.
మార్కెట్లలలో లభించే శానిటరీ ప్యాడ్ల వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను గుర్తించింది.  తనతో పాటు తన స్నేహితులకు అదే ఇబ్బందులు వచ్చాయని తెలుసుకుంది.  దీంతో కాటన్ వస్త్రంతో శానిటరీ ప్యాడ్స్ తయారు చేస్తు అతి తక్కువ సమయంలోనే అందరి ప్రశంసలు పొందుతోంది కోయంబత్తూరుకు చెందిన 18 సంవత్సరాల అమ్మాయి ఇషానా.  ఇషానా తయారు చేసే నాప్ కిన్లు పర్యావరణ హితమైనవి కావటం..చక్కటి సౌకర్యంగా..ఆరోగ్యకరంగా ఉండటంతో  ఆమె తయారు చేసిన నాప్ కిన్స్ కొనేందుకు పలువురు ముందుకొస్తున్నారు. 

ఇంటర్ మీడియట్ పూర్తి చేసిన తరువాత ఇషానా అవినాషిలింగం యూనివర్శిటీలో ఫ్యాషన్ డిజైనింగ్  కోర్స్ చేసింది. అనంతరం సొంతంగా ఓ షాపు ఓపెన్ చేసింది. మార్కెట్ లో లభించే శానిటరీ నాప్ కిన్లలో ప్లాస్టిక్ పదార్దాలు ఉండటం వల్ల తనకు ఆరోగ్య సమస్యలు వచ్చాయనీ..అటువంటి సమస్యలే తన స్నేహితులకు వచ్చాయని తెలుసుకుంది. దీంతో కాటన్ శానిటరీ ప్యాడ్ లను తయారు చేయాలని ఆలోచన వచ్చింది ఇషానాకు.  

వెంటనే పత్తితో తయారు చేసిన కాటన్ వస్త్రంతో ప్యాడ్ లను తయారుచేయం ప్రారంభించింది. లేయర్ల లేయర్లు (పొరలు పొరలుగా) ప్యాడ్ లను తయారు చేసింది. తయారీలో ప్రత్యేక జాగ్రత్తలు పాటింది. వాటిని తన స్నేహితులకు..బంధువులకు ఇచ్చింది. వాటిని వాడిన తరువాత వారి స్పందన తెలుసుకుంది. చాలా సౌకర్యవంతంగా ఉన్నాయనీ..గతంతో తాము వాడిని మార్కెట్ ప్యాడ్ ల కంటే కంఫర్టబుల్ గా ఉన్నాయని చెప్పటంతో తన మామయ్య సహకారంతో ‘అనా క్లాత్ ప్యాడ్స్’ పేరుతో ఓ చిన్న వ్యాపారాన్ని ప్రారంభించింది.  అది సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. 

ఈ సందర్భంగా ఇషానా మాట్లాడుతూ..తాను కాటన్ ప్యాడ్ ల వ్యాపారం  చేస్తానంటే మొదట్లో తన తల్లిదండ్రులు అంగీకరించలేదనీ..కానీ తనతో పాటు తన తోటి అమ్మాయిలు..మహిళలు కెమికల్ ప్యాడ్ లతో ఇబ్బందులు పడుతుంటే తాను ఏదైనా చేయాలని అనుకున్నానని ఇషానా తెలిపింది. ప్లాస్టిక్ తో చేసిన ప్యాడ్ల వల్ల వ్యక్తిగత అనారోగ్యంతో పాటు పర్యావరణానికి తీవ్రమైన హాని కలుగతుందనీ..కానీ కాటన్ ప్యాడ్ల వల్ల ఎటువంటి హాని ఉండని తెలిపింది.

తాను తయారు చేసే ప్యాడ్లకు మంచి స్పందన వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని ఇషానా ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఈ కాటన్ ప్యాడ్లు ఒక ప్యాకెట్ లో ఆరు ఉంటాయి.మార్కెట్ ప్యాడ్ల కంటే చాలా తక్కువ రేటు కూడా.  ‘అనా క్లాత్ ప్యాడ్స్’ను 12 సార్లు వాడుకోవచ్చు ఇషానా చెబుతోంది. ప్యాడ్ ను ఒకసారి వాడిన తరువాత దాన్ని నీటిలో నానబెట్టి క్లీన్ చేసి..ఎండలో ఆరబెట్టి అలా 12 సార్లు వాడుకోవచ్చని ఇషానా తెలిపింది.