వామపక్షాలకు 14 అసెంబ్లీ,4ఎంపీ సీట్లు కేటాయించిన పవన్

వామపక్షాలతో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిపిన అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుతో కలిసి ఆదివారం(మార్చి-17,2019)పవన్ పవన్ మీడియాతో మాట్లాడారు.రెండు వామపక్ష పార్టీలు సీపీఐ,సీపీఎమ్ లకు రెండేసి లోక్‌సభ, ఏడేసి అసెంబ్లీ సీట్లు కేటాయిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో ఓ కొత్త రాజకీయాన్ని ప్రవేశపెట్టాలని.. తెదేపా, వైకాపా గుత్తాధిపత్యానికి దెబ్బకొట్టాలని జనసేనతో కలిసి పోటీ చేస్తున్నామని సీపీఎం కార్యదర్శి మధు తెలిపారు. ఆ రెండు పార్టీలతో పాటు బీజేపీ, కాంగ్రెస్ లను కూడా ఉమ్మడిగా ఎదుర్కొంటామన్నారు.
దేశరాజకీయాల్లో కొత్త పోకడలు చూస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. సీఎం చంద్రబాబు అభివృద్ధి పేరుతో మాటల గారడీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ప్రతిపక్షం పూర్తిగా విఫలమైందన్నారు. ఏనాడూ ప్రజాసమస్యలపై వైకాపా పోరాడలేదన్నారు.పోరాటాలు చేయడానికే కాకుండా చట్టసభల్లోనూ వామపక్షాల పాత్ర ఉండాలనే ఆ పార్టీలతో పొత్తు పెట్టుకున్నట్లు జనసేన అధినేత పవన్‌కల్యాణ్ తెలిపారు.
అనారోగ్యంతో కన్నుమూసిన గోవా సీఎం మనోహర్ పారికర్ ఆత్మకు శాంతి చేకూరాలని పవన్ అన్నారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. పారికర్ తో తనకు ఉన్న అనుబంధాన్ని పవన్ గుర్తుచేసుకున్నారు.