Kishan Reddy: అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవంపై కాంగ్రెస్ కామెంట్లు.. కిషన్ రెడ్డి కౌంటర్
కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే తప్పుడు ప్రచారం చేస్తోందని కిషన్ రెడ్డి మండిపడ్డారు.

Kishan Reddy
అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవంపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కామెంట్లకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రామ మందిరం నిర్మాణాన్ని ఒక పార్టీకి లింకు పెట్టి మాట్లాడడం సరికాదని చెప్పారు. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ, ఆ పార్టీ ఇతర నేతలు రామ మందిరానికి వచ్చి సేవ చేయవచ్చని, ఎవరూ అభ్యంతరాలు తెలపడం లేదని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే తప్పుడు ప్రచారం చేస్తోందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఆ మందిర నిర్మాణం రాజకీయ పార్టీ కార్యక్రమం కాదని చెప్పారు. దేశంలో హిందువులు, ముస్లింలు అన్ని మతాల వారూ రామ మందిర ప్రారంభోత్సవం కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఇది 550 సంవత్సరాల పోరాటమని చెప్పారు.
ఎన్నికల కోసం తీసుకొచ్చిన కార్యక్రమం కాదని కిషన్ రెడ్డి అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జరుగుతున్న అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం అయోధ్య రామ మందిరం నిర్మాణమని చెప్పారు. కాగా, అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Vallabhaneni Balasouri: భారీ బహిరంగ సభ నిర్వహించి.. పవన్‌ను ఆహ్వానించి.. జనసేనలో చేరనున్న బాలశౌరి?