Tejashwi Yadav Gets Married : సింపుల్ గా తేజస్వీ యాదవ్ వివాహం..పెళ్లి ఫొటోలు
రాష్ట్రీయ జనతాదళ్(RJD)నాయకుడు,బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ చిన్న కుమారుడు తేజస్వీ యాదవ్(32) వివాహం ఢిల్లీకి చెందిన రాచెల్ గోడిన్హోతో జరిగింది. దాదాపు 50మంది సన్నిహితులు

Art895
Tejashwi Yadav Gets Married : రాష్ట్రీయ జనతాదళ్(RJD)నాయకుడు,బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ చిన్న కుమారుడు తేజస్వీ యాదవ్(32) వివాహం ఢిల్లీకి చెందిన రాచెల్ గోడిన్హోతో జరిగింది. దాదాపు 50మంది సన్నిహితులు,కుటుంబసభ్యుల సమక్షంలో గురువారం ఢిల్లీలోని సైనిక్ ఫామ్స్‌లో హిందూ సంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరిగింది.
అతికొద్ది మంది సమక్షంలో చాలా సింపుల్ గా జరిగిన ఈ పెండ్లి వేడుకకు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ దంపతులు, రాజ్యసభ ఎంపీ మిసా భారతి వంటి రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. కాగా, మంగళవారం రాత్రి సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో తేజస్వీ, రాచెల్ నిశ్చితార్థం జరిగింది. వీరిద్దరికీ ఏడేళ్ల నుంచి పరిచయం ఉంది. ఇక,లాలూ ప్రసాద్, రబ్రీదేవీల 9మంది సంతానంలో తేజస్వీ యాదవ్ చివరి వ్యక్తి. ఆయనకు ఏడుగురు సోదరీమణులు, ఒక సోదరుడు ఉండగా వారందరికీ వివాహాలు జరిగాయి.