Kiran Rijiju : సంప్రదాయ నృత్యంతో అదరగొట్టిన కిరణ్ రిజిజు..మొచ్చుకున్న మోదీ

కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తన సొంత రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ లో పర్యటించిన సందర్భంగా సంప్రదాయ నృత్యంతో ఆకట్టుకున్నారు.

Kiran Rijiju : సంప్రదాయ నృత్యంతో అదరగొట్టిన కిరణ్ రిజిజు..మొచ్చుకున్న మోదీ

Kiran Rijiju

Updated On : September 30, 2021 / 9:35 PM IST

Kiran Rijiju కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తన సొంత రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ లో పర్యటించిన సందర్భంగా సంప్రదాయ నృత్యంతో ఆకట్టుకున్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని వివేకానంద కేంద్ర విద్యాలయ ప్రాజెక్ట్‌ను సమీక్షించడానికి కిరణ్‌ రిజిజు ఇటీవల కజలాంగ్‌ గ్రామానికి వెళ్లారు. ఈ సందర్భంగా అరుణాచల్ ప్రదేశ్‌ సాంప్రదాయ పాటకు.. గ్రామస్తులతో కలిసి కిరణ్ రిజిజు నృత్యం చేశారు. స్థానికులు సంగీత వాద్యాలు మోగిస్తూ జానపద గీతాలు ఆలపిస్తుండగా.. కిరణ్ రిజిజు ఉత్సాహంగా కాలు కదిపారు.
ALSO READ ట్రంప్ కి వెన్నుపోటు..కోవిడ్ టైంలో చైనాకి రహస్య ఫోన్ కాల్స్ చేసిన ఆర్మీ జనరల్
ఈ వీడియోను గురువారం కిరణ్ రిజిజు తన ట్విట్టర్ లో షేర్‌ చేశారు. అతిథులు తమ గ్రామానికి వచ్చినప్పుడు సజోలాంగ్ ప్రజలు ఈ విధంగా తమ సంతోషం వ్యక్తపరుస్తారని కిరణ్ రిజిజు వెల్లడించారు. అసలుసిసలైన ఈ జానపద గీతాలు, నృత్యాలు అరుణాచల్ ప్రదేశ్ లోని ప్రతి సామాజిక వర్గానికి గుబాళింపును అందిస్తాయని ట్వీట్ లో వివరించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

కిరణ్‌ రిజిజు వీడియోపై ప్రధాని మోదీ స్పందించారు. మా న్యాయ శాఖ మంత్రి కిరణ్‌ కూడా మంచి డ్యాన్సర్.. అరుణాచల్‌ ప్రదేశ్‌ యొక్క శక్తివంతమైన, అద్భుతమైన సంస్కృతిని వీక్షించడం చాలా సంతోషంగా ఉందని మోదీ తన ట్వీట్ లో పేర్కొన్నారు.