మద్యం షాపుల ముందు క్యూ.. నవ్వు తెప్పిస్తున్న మీమ్స్, జోక్స్

  • Published By: vamsi ,Published On : May 4, 2020 / 03:14 PM IST
మద్యం షాపుల ముందు క్యూ.. నవ్వు తెప్పిస్తున్న మీమ్స్, జోక్స్

Updated On : May 4, 2020 / 3:14 PM IST

లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా వైన్ షాపులు తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వగా దేశంలోని  పలు రాష్ట్రాలల్లో మద్యం షాపులు ఓపెన్ అయ్యాయి. దీంతో మద్యం బాబులు ఈ రోజు ఉదయం నుంచి షాపుల ముందు క్యూలు కట్టారు. వీటి పై సోషల్ మీడియాలో  మీమ్స్, జోక్స్ వైరల్ అవుతూ ఉన్నాయి. మద్యం షాపుల ముందు ఉన్న  పొడవైన క్యూలపై జోకులతో ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రమ్‌లు నిండిపోయాయి. 

దేశవ్యాప్తంగా పలు చోట్ల సోమవారం ఉదయం మద్యం దుకాణాలు తెరచుకోగా.. 40 రోజులుగా నోట్లో చుక్క పడని మందు బాబులు ఉదయాన్నే మద్యం దుకాణాల ముందు బారులు తీశారు. ఈ రోజు ఎలాగైనా నోట్లో చుక్క పడాల్సిందేనంటూ గంటల తరబడి లిక్కర్‌ షాపుల ముందు పడిగాపులు కాశారు. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలలో సోమవారం ఉదయం 7:30 గంటల నుండి ప్రజలు క్యూ కట్టారు. కర్ణాటక, మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. మార్చి 24న దేశవ్యాప్తంగా ప్రకటించిన తర్వాత భారతదేశం అంతటా మద్యం దుకాణాలు మూతపడ్డాయి.  

అంతేకాదు కొన్ని చోట్ల వైన్‌ షాపులకు పూల దండలు వేసి పూజ చేసి చేశారు. మరికొందరు బ్యాండ్‌ బాజాతో మద్యం దుకాణాలకు తరలి వచ్చారు. అయితే కరోనా వైరస్ కారణంగా మద్యం షాపుల ముందు సామాజిక దూరం పాటించాలని కేంద్రం సూచించినా కూడా అనేకచోట్ల అటువంటి పరిస్థితి కనిపించలేదు. ఆ సమయంలో మద్యం దుకాణాల ముందు నించున్నా వారి విజువల్స్ ని షూట్ చేసి, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు నెటిజన్లు.