ఖాకీ కావరం : మహిళను చితకబాదిన పోలీస్

  • Published By: madhu ,Published On : May 10, 2019 / 06:26 AM IST
ఖాకీ కావరం : మహిళను చితకబాదిన పోలీస్

Updated On : May 28, 2020 / 3:42 PM IST

ఖాకీల కాఠిన్యానికి అద్దం పట్టే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియోలో మహిళతో పాటు ఓ రెండేళ్ల చిన్నారి కూడా ఉంది. తనను కొట్టవద్దంటూ ఆ మహిళ ఎంత ప్రాధేయపడినా ఆ ఖాకీ మనసు కరగలేదు. మధ్యప్రదేశ్‌ గ్వాలియార్‌కు చెందిన ఓ పోలీస్‌ స్టేషన్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. 
Also Read : ప్రపంచ టాప్ 10లో శంషాబాద్ ఎయిర్ పోర్ట్

ఈ వీడియోలో మొత్తం ముగ్గురు మహిళలు.. చిన్న పిల్లల్ని పట్టుకుని పోలీస్‌ స్టేషన్‌లో కూర్చుని ఉన్నారు. ఇంతలో ఓ అధికారి వారి దగ్గరకు వచ్చాడు. అందరిని పైకి లేవమని ఆర్డరేశాడు. దీంతో .. తమను వదిలిపెట్టమని ఏడుస్తూ ఆ అధికారిని వేడుకున్నారు. ఇంతలో ఆ అధికారి ఓ మహిళ దగ్గరకు వెళ్లి లాఠీతో పదేపదే కొడుతూనే.. జుట్టు పట్టుకుని లాగాడు. విడిచిపెట్టమని ఎంత వేడుకున్నా కరుణించలేదు. ఈ సంఘటన చోటు చేసుకున్నప్పుడు స్టేషన్‌లో మరో ముగ్గురు పోలీసులు అక్కడనే ఉన్నారు. వారిలో ఒకతను ఆ మహిళ వద్దకు వచ్చి ఆమెను తిట్టడం ప్రారంభించాడు.

అయితే.. ఈ వీడియో ఇప్పటిది కాదని రెండేళ్ల క్రితంనాటిదని  అధికారులు తెలిపారు. వీడియోలో ఉన్న అధికారి ప్రస్తుతం ఎన్నికల విధుల్లో ఉన్నాడని.. ఎలక్షన్స్‌ అయ్యాక ఈ విషయం గురించి దర్యాప్తు చేస్తామని వెల్లడించారు.
Also Read : TV9 రవి ప్రకాష్ చుట్టూ ఉచ్చు : విచారణకు హాజరవుతారా