Night Curfew : ఒమిక్రాన్ టెన్షన్..మధ్యప్రదేశ్ లో నైట్ కర్ఫ్యూ

ఓ వైపు కోవిడ్ కేసులు,మరోవైపు,కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్"కేసులు క్రమంగా దేశవ్యాప్తంగా పెరుగుతున్న వేళ మధ్యప్రదేశ్​ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం నుంచి

Night Curfew : ఒమిక్రాన్ టెన్షన్..మధ్యప్రదేశ్ లో నైట్ కర్ఫ్యూ

Madhya Pradesh Orders Night Curfew From 11 Pm To 5 Am Amid Omicron Fears

Updated On : December 23, 2021 / 11:07 PM IST

Night Curfew :  ఓ వైపు కోవిడ్ కేసులు,మరోవైపు,కోవిడ్ కొత్త వేరియంట్ “ఒమిక్రాన్”కేసులు క్రమంగా దేశవ్యాప్తంగా పెరుగుతున్న వేళ మధ్యప్రదేశ్​ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం నుంచి నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపారు.

తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఇది కొనసాగుతుందని శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు ప్రజలంతా కరోనా విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని సీఎం చౌహాన్ సూచించారు. రెండు డోసుల కొవిడ్ టీకా తీసున్నవారికి మాత్రమే నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు అనుమతి ఉంటుందని మధ్యప్రదేశ్​ ప్రభుత్వం ప్రకటించింది.

మధ్యప్రదేశ్ లోకి ఒమిక్రాన్ ప్రవేశించే అవకాశాలను కొట్టిపారేయలేమని,ఈ వేరియంట్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్నదని,రాష్ట్రంగా అలర్ట్ గా ఉందని,కోవిడ్ థర్డ్ వేవ్ ని అడ్డుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం చౌహాన్ అన్నారు. కాగా,ఇప్పటివరకు 16 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదుకాగా,మధ్యప్రదేశ్ లో మాత్రం ఇప్పటివరకు ఒమిక్రాన్ కేసు నమోదుకాలేదు.

ALSO READ CM Jagan: కొప్పర్తిలో ఇండస్ట్రియల్ హబ్_ను ప్రారంభించిన సీఎం జగన్