Police Arrests Rat: పోలీస్ స్టేషన్లో ఉన్న 60 మద్యం సీసాల్ని తాగేసిన ఎలుకను పట్టుకున్న పోలీసులు
ఇప్పటి వరకు జాయింట్ బృందాలు మొత్తంగా రూ.288,38,95,049 జప్తు చేశారు. ఇందులో రూ.31,82,65,813 నగదు, రూ. 52,22,43,636 విలువైన 25,06,234 లీటర్లకు పైగా అక్రమ మద్యం, రూ.14,58,84,331 అలాగే 81.29 కోట్ల రూపాయల విలువైన మత్తు పదార్థాలు ఉన్నాయి

Assembly Elections 2023: మధ్యప్రదేశ్‌లోని చింద్వారా కొత్వాలిలో ఓ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఎన్నికల్లో ప్రవర్తనా నియమావళి సమయంలో పట్టుబడిన మద్యాన్ని ఎలుకలు తాగేశాయి. ఇక ఎలుకలను పట్టుకునేందుకు పోలీస్ స్టేషన్‌లో బోను ఏర్పాటు చేయగా, అందులో ఒక ఎలుక చిక్కుకుంది. ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిన తర్వాత చింద్వారా కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో వివిధ కేసుల్లో 60 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను కొత్వాలి పోలీస్ స్టేషన్ ఆవరణలోని కచ్చా భవనంలో నిర్మించిన గోదాములో ఉంచారు.
చింద్వారా కొత్వాలి పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ఉమేష్ గోల్హానీ తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘ఇలా జరగడం మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా ఇలాంటి కేసులు చాలా వెలుగులోకి వచ్చాయి. కచ్చా భవనం కావడంతో రోజూ ఇలాంటి సమస్యలు స్థానిక పోలీసుల కళ్ల పడుతూనే ఉంటాయి. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి సరఫరా చేస్తున్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్నాం. అయితే వాటిని పోలీస్ స్టేషన్లో పెట్టగా, వాటిని ఎలుకలు తాగేశాయి’’ అని ఆయన చెప్పారు.
మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించిన అనంతరం.. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చినప్పటి నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు రాష్ట్ర వ్యాప్తంగా చురుగ్గా ఉన్నాయి. ఇప్పటి వరకు జాయింట్ బృందాలు మొత్తంగా రూ.288,38,95,049 జప్తు చేశారు. ఇందులో రూ.31,82,65,813 నగదు, రూ. 52,22,43,636 విలువైన 25,06,234 లీటర్లకు పైగా అక్రమ మద్యం, రూ.14,58,84,331 అలాగే 81.29 కోట్ల రూపాయల విలువైన మత్తు పదార్థాలు ఉన్నాయి. రూ.108,45,75,385 విలువైన లోహం, బంగారం-వెండి, నగలు, రూ.108,45,75,385 విలువైన ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.