మధ్యప్రదేశ్ లో తొలి కరోనా మృతి

  • Published By: venkaiahnaidu ,Published On : March 25, 2020 / 01:39 PM IST
మధ్యప్రదేశ్ లో తొలి కరోనా మృతి

Updated On : March 25, 2020 / 1:39 PM IST

మధ్యప్రదేశ్ లో తొలి కరోనా మరణం నమోదైంది. కరోనా సోకిన ఉజ్జయినికి చెందిన 65ఏళ్ల మహిళ ఇండోర్ లోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని MY హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ ఇవాళ(మార్చి-25,2020)కన్నుమూసింది.  ఉజ్జయినిలో ప్రధమిక చికిత్ప తర్వాత ఆమె ఇండోర్ హాస్పిటల్ లో చేరింది.

ఈమె మరణంలో దేశంలో ఇప్పటివరకు కరోనా మృతుల సంఖ్య 12కి చేరింది. మధ్యప్రదేశ్ లో ఇప్పటివరకు 14కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 606కి చేరింది. అయితే ఇందులో 43మందికి నయమైపోయి డిశ్చార్జ్ అయ్యారు.