Maharashtra: బహిరంగ సభలో మరణాలతో.. మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..
మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మధ్యాహ్నం సమయంలో ఎలాంటి బహిరంగ సభలు, కార్యక్రమాలు నిర్వహించరాదని ఆదేశాలు జారీ చేసింది.

Maharashtra
Maharashtra: దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం వేళ ప్రజలు బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. దీనికితోడు వేడి గాలులు వీస్తుండటంతో ప్రజలు వడదెబ్బ భారిన పడుతున్నారు. గత మూడు రోజుల క్రితం ఎండ వేడిమి కారణంగా మహారాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మహారాష్ట్ర భూషణ్ కార్యక్రమం (Maharashtra Bhushan Programme) లో పాల్గొని 14 మంది మరణించారు. మధ్యాహ్నం సమయంలో గంటల కొద్దీ ఎండలో ఉండి కార్యక్రమంలో పాల్గొనడం వడదెబ్బతో వారు మరణించారు. మరికొందరు తీవ్ర అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
బహిరంగ సభలో 14మంది మరణించడంతో మహారాష్ట్ర ప్రభుత్వం (Maharashtra Government) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎండల తీవ్రత, వేడి గాలుల ప్రభావం తగ్గే వరకు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించొద్దని ఆదేశాలు జారీ చేసింది. కొత్త నిబంధనలతో రాష్ట్ర ప్రభుత్వ తీర్మానాన్ని జారీ చేస్తుందని కేబినెట్ మంత్రి మంగళ్ ప్రభాత్ లోధా ధృవీకరించారు.
Maharashtra: ఎన్సీపీతో చేతులు కలపడంపై బీజేపీకి వార్నింగ్ ఇచ్చిన ఏక్నాథ్ షిండే
గత ఆదివారం మహారాష్ట్ర ప్రభుత్వం ‘మహారాష్ట్ర భూషణ్’ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించింది. ముంబైలోని ఖర్ఘర్ లో జరిగిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని యాక్టివిస్ట్ అప్పాసాహెబ్ ధర్మాధికారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అమిత్ షా, మహారాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎం తదితరులు హాజరై అవార్డును అందజేశారు. అయితే, ఈ అవార్డుల కార్యక్రమానికి వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. వారికి ప్రభుత్వం ఎలాంటి రక్షణ చర్యలు ఏర్పాటు చేయకపోవటంతో మూడు గంటల పాటు ఎండలో ఉండే కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ అక్రమంలో అనేక మందికి వడదెబ్బ సోకడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. 14మంది మరణించారు. మరికొంత మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.