నందిగ్రామ్ లో మమత ర్యాలీ..బెంగాల్ లో బీజేపీకి రాజకీయ పాతర
వెస్ట్ బెంగాల్ లో రెండో దశ ఎన్నికల పోలింగ్ నేటితో ముగినయనుండటంతో పార్టీల ప్రచారం హోరాహోరీ దశకు చేరుకుంది. సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తోన్న నందిగ్రామ్ నియోజకవర్గానికి రెండో విడతలోనే(ఏప్రిల్-1,2021)పోలింగ్ జరగనుంది.

Mamata Banerjee In Nandigram Rally
Mamata Banerjee in Nandigram rally వెస్ట్ బెంగాల్ లో రెండో దశ ఎన్నికల పోలింగ్ నేటితో ముగినయనుండటంతో పార్టీల ప్రచారం హోరాహోరీ దశకు చేరుకుంది. సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తోన్న నందిగ్రామ్ నియోజకవర్గానికి రెండో విడతలోనే(ఏప్రిల్-1,2021)పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం(మార్చి-30,2021)నందిగ్రామ్ నియోజకవర్గంలో మమత పర్యటించారు. ఇటీవల దీదీ కాలికి గాయం కాగా.. చక్రాల కుర్చీలోనే కూర్చొని నియోజకవర్గంలోని సోనా చురా ప్రాంతంలో ర్యాలీ నిర్వహించారు. మమత ర్యాలీకి భారీ ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. చక్రాల కుర్చీలో ఉన్న దీదీ వెంటే నడిచారు. ర్యాలీ మొత్తం టీఎంసీ నినాదాలతో హోరెత్తిపోయింది.
మమత మాట్లాడుతూ..ఏ నియోజకవర్గం నుంచైనా నేను పోటీ చేయొచ్చు. కానీ నేను నందిగ్రామ్‌ను ఎంచుకున్నాను. ఇక్కడి అమ్మలు, సోదరీమణులను గౌరవించేందుకు ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నాను. నందిగ్రామ్ లో జరిగిన ఉద్యమానికి సెల్యూట్ చేసేందుకు సింగూర్ బదులు ఈ ప్రాంతం నుంచి పోటీ చేస్తున్నా. గుర్తుంచుకోండి.. నందిగ్రామ్‌లోకి ఒక్కసారి అడుగుపెడితే నేను ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లను. నందిగ్రామ్ నా ప్రాంతం. ఇక్కడే ఉంటా. బీజేపీని నందిగ్రామ్ నుంచి పశ్చిమ బెంగాల్ నుంచి తరిమికొట్టాలని ప్రజలను మమత కోరారు. పశ్చిమ బెంగాల్‌లో కాషాయ పార్టీని రాజకీయంగా సమాధి చేయాలని మమతా బెనర్జీ ప్రజలకు పిలుపు ఇచ్చారు.
తాను రాష్ట్రంలో ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేయగలనని, అయితే ఇక్కడి తల్లులు, సోదరీమణులను గౌరవించే ఉద్దేశంతో నందిగ్రామ్‌ను ఎంచుకున్నాని చెప్పారు. నందిగ్రామ్ ఉద్యమానికి వందనాలంటూ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నానని చెప్పారు. ఇక ఈ ప్రాంతాన్ని తాను విడిచిపెట్టనని ఇక్కడే ఉంటానని అన్నారు. బీజేపీని నందిగ్రామ్ నుంచి పశ్చిమ బెంగాల్ నుంచి తరిమికొట్టాలని కోరారు. ఎన్నికల్లో ఓటర్లు ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మమత ఓటర్లను కోరారు. 48 గంటలపాటు మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలని, టీఎంసీకి ఓటు వేయాలని కోరారు. ‘‘కూల్ కూల్ తృణమూల్, ఠండా ఠండా కూల్ కూల్, ఓట్ పాబే జోడా ఫూల్’’ అని నినదించారు. నందిగ్రామ్ నియోజకవర్గంలో బీజేపీ..ఓటర్లను “భయపెట్టడానికి” బీజేపీ పాలిత రాష్ట్రాల నుండి పోలీసు బలగాలను తీసుకువచ్చినట్లు మమతా బెనర్జీ ఆరోపించారు.
ఇక, నందిగ్రామ్‌లో మమతా బెనర్జీపై బీజేపీ తరపున ఆమె పాత మిత్రుడు సువేందు అధికారి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. నందిగ్రామ్‌లో గెలిచి తీరాలని బీజేపీ, టీఎంసీ గట్టిగా కృషి చేస్తున్నాయి. సువేందు అధికారిని ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిపించాలని ఓటర్లను బీజేపీ అగ్ర శ్రేణి నేతలు కూడా కోరుతున్నారు. అదేవిధంగా బీజేపీ అభ్యర్థి సువేందు అధికారిపై గెలిచి తీరాలని మమత బెనర్జీ కూడా పట్టుదలగా ఉన్నారు.