Chhattisgarh IAS Officer: చెంపదెబ్బ కొట్టిన ఐఏఎస్ అధికారి కొత్త ఫోన్ కొనివ్వాలి – సీఎం
ఓ వ్యక్తిని చెంపదెబ్బ కొట్టి అతని ఫోన్ నేలకేసి కొట్టిన ఐఏఎస్ అధికారి సస్పెండ్ అయ్యారు. అదేకాక బాధితుడికి కొత్త ఫోన్ కొనివ్వాలంటూ ఛత్తీస్ గఢ్ సీఎం రీసెంట్ గా ఆదేశాలిచ్చారు.

Ias Officer
Chhattisgarh IAS Officer: ఓ వ్యక్తిని చెంపదెబ్బ కొట్టి అతని ఫోన్ నేలకేసి కొట్టిన ఐఏఎస్ అధికారి సస్పెండ్ అయ్యారు. అదేకాక బాధితుడికి కొత్త ఫోన్ కొనివ్వాలంటూ ఛత్తీస్ గఢ్ సీఎం రీసెంట్ గా ఆదేశాలిచ్చారు. సీఎం భూపేశ్ బాగేల్.. తప్పుడు ప్రవర్తన కనబరిచిన ఐఏఎస్ కాంపన్సేషన్ కింద కొత్త ఫోన్ కొనివ్వాలంటూ ఆర్డర్ ఇచ్చారు.
సూరజ్ పూర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ రణబీర్ శర్మ రోడ్ మీద చెంపదెబ్బ కొట్టిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అయి అది కాస్తా సీఎం దృష్టికి వెళ్లింది.
కలెక్టర్ తప్పుడు ప్రవర్తన కనబరిచి.. మొబైల్ డ్యామేజ్ చేసినందుకుగా గానూ కాంపన్సేషన్ కింద కొత్త ఫోన్ కొనివ్వాలని సూచించారు. ఈ మేరకు సదరు విషయాన్ని సీఎంఓ ట్వీట్ ద్వారా వెల్లడించింది.
‘ఒక సీనియర్ అధికారి ఇలా ప్రవర్తించకూడదు. తప్పుడు ప్రవర్తన కనబరిచిన వారిపై తప్పక యాక్షన్ తీసుకోవాలి. ఇటువంటి సమయంలో అస్సలు అలా చేసి ఉండకూడదు. అతని పర్సనల్ ఖర్చుతో శర్మ కొత్త ఫోన్ కొనివ్వాలి’ అని ఓ స్టేట్మెంట్ లో
ఛత్తీస్ ఘడ్ ఐఏఎస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సీకే ఖైతన్ అన్నారు.
బహిరంగ క్షమాపణ చెప్తూ ఇంకెప్పుడూ మరెవ్వరినీ అవమానించనని అనే విధంగా రెస్పాన్స్ ఇచ్చారు సూరజ్ పూర్ కలెక్టర్.