మన్ కీ బాత్ : దీపావళి శుభాకాంక్షలు…కోట్లాది మందికి ఆనందం కలిగించేలా అయోధ్య తీర్పు

  • Published By: venkaiahnaidu ,Published On : October 27, 2019 / 10:19 AM IST
మన్ కీ బాత్ : దీపావళి శుభాకాంక్షలు…కోట్లాది మందికి ఆనందం కలిగించేలా అయోధ్య తీర్పు

Updated On : October 27, 2019 / 10:19 AM IST

దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇవాళ(అక్టోబర్-27,2019)58వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోడీ ప్రసంగిస్తూ…భారతీయులతోపాటు అనేక దేశాల్లోని ప్రభుత్వాలు, ప్రజలు, సామాజిక సంస్థలు కూడా దీపావళి ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నాయి. భారతదేశ సంబరాలు దేశవిదేశాల్లో కూడా ప్రతిబింబిస్తున్నాయన్నారు.పండుగులకు భారతదేశం నెలవని, ఫెస్టివల్ టూరిజానికి భారత్ లో అనేక అవకాశాలున్నాయని అన్నారు. ఖాదీ వంటి వివిధ స్థానిక ఉత్పత్తులను ప్రజలు కొనుగోలు చేయాలని మోడీ తెలిపారు.

ఈ సందర్భంగా అయోధ్య, రామజన్మభూమి ప్రస్తావన వచ్చింది. 2010 సెప్టెంబర్‌లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రధాని గుర్తు చేశారు. ఆ తర్వాత సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయని, త్వరలోనే తీర్పు రానుందని అన్నారు. దేశంలోని ప్రజల మనోభావాలకు అనుగుణంగానే తీర్పు ఉంటుందని భావిస్తున్నట్టు చెప్పారు. తీర్పు వెలువడానికి ఐదు రోజులు పడుతుందో, ఏడు రోజులు, పది రోజులు పడుతుందో తాను చెప్పలేనని, అయితే తీర్పు వెలుడగానే కోట్లాది మంది ప్రజలకు ఆనందాన్ని కలిగిస్తుందని, ఆశ్చర్యపరచే మార్పును కలిగిస్తుందని మోడీ తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు న్యాయవ్యవస్థ గర్వపడేలా ఉంటుందనే నమ్మకం తనకు ఉందని ప్రధాని అన్నారు.

అక్టోబర్-31న సర్థార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయనన మోడీ గుర్తుచేసుకున్నారు. పటేల్ కు నివాళులర్పించారు. మ్యాన్ ఆఫ్ డీటెయిల్ గా పటేల్ ను అభివర్ణించారు. వివిధ రాజ్యాలను భారత్ లో విలీనం చేసి చారిత్రత్మకమైన పాత్ర పటేల్ పోషించారని మోడీ అన్నారు.  హైదరాబాద్ లో ప్రతీ అభివృద్ధిపై పటేల్ కు ముందుచూపు ఉండేదన్నారు. లక్ష్యద్వీప్ విషయంలో పటేల్ పాత్ర చాలా ముఖ్యమైనదని అన్నారు. లక్ష్యద్వీప్ లో ప్రజలు పర్యటించాలని మోడీ కోరారు. గుజరాత్ లోని పటేల్ జ్ణాపకార్థం ఏర్నాటు చేసిన ఐక్యతా విగ్రహాన్ని ఏడాదిలో 26లక్షలమంది సందర్శించారని మోడీ తెలిపారు.ఈ సందర్భంగా దివంగత ప్రధాని ఇందిరాగాంధీకి మోడీ నివాళుర్పించారు. అక్టోబర్-31న ఇందిరాగాంధీ హత్యకు గురైన విషయం తెలిసిందే.
తన ప్రసంగంలో సైనికులను మోడీ గుర్తుచేసుకున్నారు.సియాచిన్ గ్లేసియర్ దగ్గర ఉన్న మన సైనికులు సరిహద్దులను రక్షించడమే కాకుండా.. ‘క్లీన్ సియాచిన్’ డ్రైవ్‌ను కూడా నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. ఈ నిబద్ధతకు భారత సైన్యానికి వందనం చేస్తున్నానన్నారు. పలువరు పంపిన మహిళలను ఇన్స్ పైర్(ప్రేరేపించే)చేసే రియల్ లైఫ్ స్టోరీలను మోడీ చదివి వినిపించారు. మహిళల సాధికారత గురించి 17వ శతాబ్దంలో కన్నడ కవయిత్రి సంచి హొన్నమ్మ రాసిన పద్యాన్ని మోడీ చదివి వినిపించారు. నవంబర్-12,219న ప్రపంచవ్యాప్తంగా సెలబ్రేట్ చేసుకునే గురునానక్  దేవ్ 550వ జయంతి గురించి ఈ సందర్భంగా మోడీ ప్రస్తావించారు.