రెండు తలల పాము.. రేటు కోట్లలో.. అమ్ముతుండగా అరెస్ట్

  • Published By: vamsi ,Published On : December 30, 2019 / 05:05 AM IST
రెండు తలల పాము.. రేటు కోట్లలో.. అమ్ముతుండగా అరెస్ట్

Updated On : December 30, 2019 / 5:05 AM IST

అంతర్జాతీయ మార్కెట్లో భారీ డిమాండు ఉన్న పాము ‘రెడ్‌ సాండ్‌  బో’. ఈ పాములో విషం ఉండదు. దీనికి రెండు తలలు ఉంటాయి. ఈ అరుదైన రెడ్‌ సాండ్‌ బో పామును ఉపయోగించి ఖరీదైన మెడిసిన్స్‌, కాస్మోటిక్‌ తయారు చేస్తారు. చేతబడిలో కూడా ఈ పామును ఉపయోగిస్తారని అంటుంటారు.

అటువంటి అరుదైన పామును మధ్యప్రదేశ్‌లోని నర్సింగ్‌ఘర్‌లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ. కోటీ 25లక్షలకు ఈ పామును ఐదుగురు సభ్యుల ముఠా అమ్ముతుండగా పోలీసులు పట్టుకున్నారు. 

పామును అమ్ముతున్నట్లు సమాచారం అందుకున్న మధ్యప్రదేశ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అయిన వారిలో ముగ్గురు మైనర్లు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అంతర్జాతీయిమార్కెట్లో భారీ ఎత్తున డిమాండ్‌ పలికే ఈ పాము ‘రెడ్‌ సాండ్‌  బో’. గతంలో తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్ర పరిధిలోని చెన్నపూర్ గ్రామంలో ఓ రైతుకు కూడా ఈ పాము కనిపించింది.

దీనిని ఇంట్లో పెంచుకుంటే మంచి జరుగుతుందని కొంతమంది నమ్మకం. లేటెస్ట్‌గా దొరికిన ఈ పామును షేహోర్‌ జిల్లాలోని అటవి ప్రాంతంలో పట్టుకుని వచ్చినట్లు నిందితులు పోలీసుల విచారణలో వెల్లడించారు. దీంతో వారిపై వన్యప్రాణి రక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు.