India : ఎక్కువమంది పిల్లలున్న తల్లిదండ్రులకు రూ.లక్ష బహుమానం

ఎక్కుమంది పిల్లలున్న తల్లిదండ్రులకు రూ.లక్ష బహుమతి ఇస్తామని మిజోరాం క్రీడాశాఖ మంత్రి రాబర్ట్ రోమవీయా రోయ్‌తే ఈ సంచనల ప్రకటన చేశారు. దేశంలో పలు రాష్ట్రాలు జనాభా నియంత్రణ విధానాన్ని సమర్ధిస్తున్న తరుణంలో మిజోరంలో మంత్రి చేసిన ప్రకటన సంచలనంగా మారింది. మిజో వర్గాల్లో జనాభా పెరుగుదలను ప్రోత్సహించడానికి తన నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో పిల్లలతో నివశిస్తున్న తల్లిదండ్రులకు లక్షరూపాయల నగదు ప్రోత్సాహకాన్ని మంత్రి రాబర్ట్ ప్రకటించారు. మిజో తెగ జనాభాను పెంచేందుకు మంత్రి రాబర్ట్ రోమవీయా బంపర్ ఆఫర్ ప్రకటించి వార్తల్లో నిలిచారు. తన నియోజకవర్గంలో అత్యధిక సంతానం ఉన్న కుటుంబాల్లో తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరికి రూ. లక్ష రూపాయలను ఇస్తానని ప్రకటించారు. ఫాదర్స్ డే సందర్భంగా మంత్రి రోమవీయా ఈ ప్రకటనను చేయటం విశేషం.

India : ఎక్కువమంది పిల్లలున్న తల్లిదండ్రులకు రూ.లక్ష బహుమానం

Mizoram Minister Robert Romawia Royte Announce

Updated On : June 22, 2021 / 10:59 AM IST

Mizoram Minister Robert Romawia Royte Announce : అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో భారత్ కూడా ఒకటి. ఇటువంటి భారత్ లో ఎక్కుమంది పిల్లలున్న తల్లిదండ్రులకు బహుమతి ఇస్తాం అంటోంది ఓ రాష్ట్ర ప్రభుత్వం. జపాన్ లో పిల్లల్ని కనమని జనాలకు మొత్తుకుని మరీ చెబుతోంది ప్రభుత్వం. కానీ దానికి ఏమాత్రం స్పందన లేదు. కానీ మన ఇండియాలో కూడా దాదాపు అటువంటి ప్రకటనే ప్రకటించింది ఓరాష్ట్రం. అదే మిజోరాం.

మిజోరాం మంత్రి అత్యధిక పిల్లలున్న తల్లిదండ్రులకు రూ.లక్ష బహుమతి ఇస్తామని ప్రకటించింది. మిజోరాం క్రీడాశాఖ మంత్రి రాబర్ట్ రోమవీయా రోయ్‌తే ఈ సంచనల ప్రకటన చేశారు. దేశంలో పలు రాష్ట్రాలు జనాభా నియంత్రణ విధానాన్ని సమర్ధిస్తున్న తరుణంలో మిజోరంలో మంత్రి చేసిన ప్రకటన సంచలనంగా మారింది.

మిజో వర్గాల్లో జనాభా పెరుగుదలను ప్రోత్సహించడానికి తన నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో పిల్లలతో నివశిస్తున్న తల్లిదండ్రులకు లక్షరూపాయల నగదు ప్రోత్సాహకాన్ని మంత్రి రాబర్ట్ ప్రకటించారు. మిజో తెగ జనాభాను పెంచేందుకు మంత్రి రాబర్ట్ రోమవీయా బంపర్ ఆఫర్ ప్రకటించి వార్తల్లో నిలిచారు. తన నియోజకవర్గంలో అత్యధిక సంతానం ఉన్న కుటుంబాల్లో తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరికి రూ. లక్ష రూపాయలను ఇస్తానని ప్రకటించారు. ఫాదర్స్ డే సందర్భంగా మంత్రి రోమవీయా ఈ ప్రకటనను చేయటం విశేషం.

మిజోరాం రాజధాని ఐజాల్ లోని ఈస్ట్ -2 అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో సంతానం ఉన్న సజీవ పురుషుడు, లేదా స్త్రీకి లక్షరూపాయల నగదు బహుమతిని ఇస్తామని మంత్రి చెప్పారు.దీంతో పాటు సర్టిఫికెట్, ట్రోఫీని కూడా ఇస్తామని మంత్రి తెలిపారు. ఈ ప్రోత్సాహక బహుమతి ఖర్చును మంత్రి కుమారుడి యాజమాన్యంలోని నిర్మాణ కన్సల్టెన్సీ సంస్థ ఇవ్వనుంది. మిజో జనాభా తగ్గుతుండటం తనను తీవ్ర ఆందోళన కలిగిస్తోందని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మిజోరం జనాభా 10,91,014 మంది అని అతితక్కువ జనసాంద్రత ఉన్న ప్రాంతంగా పేరొందింది.

కాగా 2021 జనవరి నుంచి ఇద్దరు పిల్లలకు పైగా ఉన్నవారు ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులు కాదని అసోం ప్రకటించింది. లబ్ధిదారులకు నగదు ప్రోత్సాహకంతో పాటూ ఓ ట్రోఫిని కూడా బహూకరిస్తామని తెలిపారు.గిరిజనుల్లో.. మిజోలు లాంటి చిన్న తెగల్లో జనాభా తక్కువగా ఉందని ఇదో పెద్ద సమస్యగా మారిందని.. అందుకే ఇటువంటి వినూత్న ప్రోత్సహాకాలు అవసరమని మంత్రి ఈ సందర్భంగా వివరించారు.