Uttar Pradesh: ఆరేళ్ల బాలుడి నోటిని గమ్‌తో అతికించి హత్య చేసిన టీచర్ మనుమడు

యూపీలోని డియోరియాలో దారుణం జరిగింది. ఆరేళ్ల వయస్సున్న బాలుడ్ని కిడ్నాప్ చేసి చంపేశారు. అతని ట్యూషన్ టీచర్ మనుమడు (20) ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ట్యూషన్ టీచర్ మనుమడు అయిన అమన్.. సంస్కర్ ట్యూషన్ క్లాస్ నుంచి తిరిగి వెళ్తుండగా కిడ్నాప్ చేశాడు.

Uttar Pradesh: ఆరేళ్ల బాలుడి నోటిని గమ్‌తో అతికించి హత్య చేసిన టీచర్ మనుమడు

Dead

Updated On : July 8, 2022 / 1:34 PM IST

 

 

Uttar Pradesh: యూపీలోని డియోరియాలో దారుణం జరిగింది. ఆరేళ్ల వయస్సున్న బాలుడ్ని కిడ్నాప్ చేసి చంపేశారు. అతని ట్యూషన్ టీచర్ మనుమడు (20) ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ట్యూషన్ టీచర్ మనుమడు అయిన అమన్.. సంస్కర్ ట్యూషన్ క్లాస్ నుంచి తిరిగి వెళ్తుండగా కిడ్నాప్ చేశాడు.

నిందితుడు చేతులు కట్టేయడంతో పాటు నోటికి గమ్ అతికించి హత్యకు పాల్పడ్డాడు. బుధవారం ట్యూషన్ కు వెళ్లేందుకు బయల్దేరిన సంస్కర్ యాదవ్ (6) కనిపించకుండాపోయాడు. ఎంక్వైరీలో అతని మృతదేహం ట్యూషన్ టీచర్ ఇంట్లో దొరికిందని డియోరియా ఎస్పీ సంకల్ప్ శర్మ వివరించారు.

బుధవారం ట్యూషన్ టీచర్, అతని కుటుంబ సభ్యులను అనుమానించిన పోలీసులు ఇంటరాగేషన్ జరపడంతో అమన్ తానే హత్య చేశానని ఇంట్లోని బాత్రూంలో దాచి పెట్టానని ఒప్పుకున్నాడు. అప్పులు తీర్చుకునేందుకు కిడ్నాప్ చేసినట్లు తెలిపాడు. ట్యూషన్ టీచర్ ఇంట్లో దొరికిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

Read Also: ఉత్తర ప్రదేశ్ లో నగల వ్యాపారి సజీవ దహనం