మోదీ తొలి 15 రోజుల పాలన.. దేశంలో ప్రస్తుతమున్న 10 సమస్యలపై నిలదీసిన రాహుల్ గాంధీ

Rahul Gandhi: ఎన్డీయే తొలి 15 రోజుల్లో జరిగినవి.. ఏంటో తెలిపారు రాహుల్ గాంధీ..

మోదీ తొలి 15 రోజుల పాలన.. దేశంలో ప్రస్తుతమున్న 10 సమస్యలపై నిలదీసిన రాహుల్ గాంధీ

Rahul-Modi

ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ మూడోసారి ఎన్నికయ్యాక ఈ తొలి 15 రోజుల పాలనలో దేశంలో చోటుచేసుకున్న పరిణామాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని దేశంలో ప్రస్తుతం ఉన్న 10 సమస్యలపై ఆయన ఎక్స్ లో నిలదీశారు.

వాటిలో నీట్, యూజీసీ నెట్, రైలు ప్రమాదం, నీటి సంక్షోభం వంటివి ఉన్నాయి. దేశంలో ఇన్ని సమస్యలు ఉండగా మోదీ మాత్రం తన ప్రభుత్వాన్ని రక్షించుకోవడంపైనే దృష్టి పెట్టారని చెప్పారు.

‘‘ఎన్డీయే తొలి 15 రోజుల్లో జరిగినవి.. 1. ఘోర రైలు ప్రమాదం, 2. కశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడులు 3. రైళ్లలో ప్రయాణికుల దుస్థితి 4. నీట్ స్కామ్, 5. నీట్ పీజీ రద్దు 6. యూజీసీ నెట పేపర్ లీక్ 7. పాలు, పప్పులు, గ్యాస్ ధరల పెరుగుదల 8. కార్చిచ్చు, 9.నీటి సంక్షోభం, 10.అధిక ఉష్ణోగ్రతల సమయంలో ఏర్పాట్లు చేయకపోవడంతో మరణాలు” అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

ఇండియా కూటమి బలమైన విపక్షంగా ఉందని, ప్రజల గళాన్ని వినిపిస్తూనే ఉంటుందని రాహుల్ గాంధీ చెప్పారు. జవాబుదారీతనం లేకుండా ప్రధాని మోదీ తప్పించుకునే అవకాశాన్ని ఇవ్వబోమని అన్నారు. రాజ్యాంగంపై నరేంద్ర మోదీ, ఆయన ప్రభుత్వం దాడి చేయడం తమకు ఆమోదయోగ్యమయ్యే విషయం కాదని చెప్పారు.

Also Read: కష్టాన్ని నమ్ముకుని బతికే ఇతడి వీడియోలు వైరల్ కావడంతో బలవన్మరణానికి పాల్పడిన వైనం