తప్పిన ప్రమాదం ..వరదలో చిన్నారుల ట్రక్కు

  • Published By: chvmurthy ,Published On : September 29, 2019 / 09:54 AM IST
తప్పిన ప్రమాదం ..వరదలో చిన్నారుల ట్రక్కు

Updated On : September 29, 2019 / 9:54 AM IST

ఉత్తరాదిని వర్షాలు వణికిస్తున్నాయి. రాజస్ధాన్ లో కురిసిన వర్షాలకు నదులు, చెరువులు, సరస్సులు, పొంగి ప్రవహిస్తున్నాయి. రాజస్ధాన్లోని ధుంగార్‌పూర్‌లో  పెద్ద ప్రమాదం తప్పింది. శనివారం స్కూల్  పిల్లలతో వెళ్తున్న ట్రక్కు వరద నీరు వస్తున్న రోడ్డుపై నుంచి వెళ్తుండగా..అదుపు తప్పి పక్కన ఉన్న గోతిలోకి ఒరిగింది.

స్థానికులు వెంటనే అప్రమత్తమై ట్రక్కును వరదలో కొట్టుకుపోకుండా తాళ్ల సాయంతోకొంచెం పైకి లాగగా డ్రైవర్ వెంటనే ట్రక్కును ముందుకుపోనిచ్చాడు. స్థానికులంతా కలిసి 20 మంచి చిన్నారుల ప్రాణాలు కాపాడారు. కొంచెం ఆలస్యమైనా ట్రక్కుతో పాటు చిన్నారులు వరదల్లో కొట్టుకుపోయేవారు.