ఎన్నికల వేళ.. కాంగ్రెస్ కు బిగ్ షాక్!

సార్వత్రిక ఎన్నికల వేళ.. గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ప్రముఖ కాంగ్రెస్ ఓబీసీ నేత, రాధాన్ పూర్ ఎమ్మెల్యే అల్పేష్ థాకూర్ పార్టీకి రాజీనామా చేసినట్టు సమాచారం.

  • Published By: sreehari ,Published On : April 10, 2019 / 06:12 AM IST
ఎన్నికల వేళ.. కాంగ్రెస్ కు బిగ్ షాక్!

Updated On : April 10, 2019 / 6:12 AM IST

సార్వత్రిక ఎన్నికల వేళ.. గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ప్రముఖ కాంగ్రెస్ ఓబీసీ నేత, రాధాన్ పూర్ ఎమ్మెల్యే అల్పేష్ థాకూర్ పార్టీకి రాజీనామా చేసినట్టు సమాచారం.

సార్వత్రిక ఎన్నికల వేళ.. గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ప్రముఖ కాంగ్రెస్ ఓబీసీ నేత, రాధాన్ పూర్ ఎమ్మెల్యే అల్పేష్ థాకూర్ పార్టీకి రాజీనామా చేసినట్టు సమాచారం. అల్పేష్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పినట్టు ఆయన సన్నిహితుడు ధావల్ ఝాలా తెలిపారు.
Read Also : సమంత పిలుపు : ఆ టీడీపీ అభ్యర్థిని గెలిపించండి

సార్వత్రిక ఎన్నికల తొలి దశకు ఒక రోజు ముందే అల్పేష్ కాంగ్రెస్ కు రాజీనామా చేయడం పట్ల పార్టీ నేతల్లో ఆందోళన నెలకొంది. రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల్లో టికెట్ల పంపిణీలో అసంతృప్తితో ఉన్న అల్పేష్.. రాజీనామా నిర్ణయానికి వచ్చినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.

కాంగ్రెస్ నుంచి అల్పేష్.. త్వరలో బీజేపీ పార్టీలో చేరనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. 2017లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ముందు థాకూర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీజేపీ ప్రత్యర్థి లవింజీ థాకూర్ పై రాధాన్ పూర్ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన అల్పేష్ 15వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మార్చిలో అల్పేష్ కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరతారంటూ వార్తలు వినిపించాయి. బీజేపీ కూడా అల్పేష్ ను తమ పార్టీలో చేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తోంది. 
Read Also : 11న సెలవు ప్రకటించని సంస్థలపై చర్యలు : దాన కిషోర్