Omicron Cases : దేశంలో 8 లక్షలు దాటిన కరోనా యాక్టివ్ కేసులు.. ఒమిక్రాన్ 4,461 కేసులు
భారతదేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గడిచిన 24 గంటలలో 1,68,063 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటలలో 69,959 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు.

Omicron Cases India’s Active Caseload Crosses 8 Lakh, Omicron Tally At 4,461
Omicron Cases : భారతదేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గడిచిన 24 గంటలలో 1,68,063 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటలలో 69,959 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. కరోనా మహమ్మారి బారిన పడి 277 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం 8,21,446 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. ప్రస్తుతం కొవిడ్ పాజిటివిటీ రేటు 10.64 శాతంగా నమోదైంది. మరోవైపు ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటలలో 4,461 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. మంగళవారం ఒక్క రోజులో 1,68,063 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 8,21,446కి చేరుకుంది. సోమవారం 1,79,723 కొత్త కేసులు నమోదు కాగా.. రోజువారీ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో దేశంలో రోజువారీ పాజిటివ్ రేటు 10.64 శాతంగా నమోదు కాగా.. 277 కరోనా మరణాలు నమోదయ్యాయి.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఒమిక్రాన్ సంఖ్య 4,461కి చేరుకుంది. మహారాష్ట్రలో అత్యధికంగా (1,247) కేసులు నమోదయ్యాయి. రాజస్థాన్ (645), ఢిల్లీ (546) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మంగళవారం ఉదయం 9 గంటల నాటికి 1,711 మంది కోలుకున్నారు లేదా డిశ్చార్జ్ అయ్యారు. కర్ణాటకలో, 479 ఒమిక్రాన్ కేసులలో, 26 మంది కోలుకోగా, కేరళలో 350 కేసులలో 140మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. తమిళనాడులో 185 ఒమిక్రాన్ బాధితుతు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని ప్రకటనలో తెలిపింది. కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై కూడా కరోనా సోకింది. రాష్ట్రంలో మొత్తంగా 11,698 కొత్త కేసులు నమోదయ్యాయి. బీహార్ సీఎం నితీష్ కుమార్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. రాష్ట్రంలో 4,737 కొత్త కేసులు నమోదు కాగా.. అందులో ఆరేళ్ల బాలికతో సహా ఐదు మరణాలు నమోదయ్యాయి. పంజాబ్‌లో కొత్తగా 3,969 కరోనా కేసులు నమోదు కాగా.. ఏడు మరణాలు నమోదయ్యాయి.
తమిళనాడులో కొత్తగా 13,990 కేసులు నమోదయ్యాయి. జనవరి 31 వరకు కోవిడ్ ఆంక్షలను పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పశ్చిమ బెంగాల్‌లో సోమవారం తక్కువ కరోనా కేసులు నమోదయ్యాయి . గత 24 గంటల్లో మొత్తం కొవిడ్ శాంపిల్స్ పరీక్షించగా.. కేసులు 51, 675కి తగ్గాయి. టెస్టు ల్యాబ్‌లను మూసివేయడంతో శనివారం రోజువారీ టెస్టుల సంఖ్య కన్నా ఆదివారం దాదాపు 20వేల వరకు తగ్గాయని అధికారులు చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీ, ముంబై నగరాల్లో కూడా మునుపటి రోజు కంటే తక్కువ కరోనా కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో సోమవారం హెల్త్ బులెటిన్‌లో 19,166 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక రోజు క్రితం 22,751 కేసులు నమోదయ్యాయి. ముంబైలో లేటెస్ట్ కోవిడ్ కేసులు 30 శాతం వరకు తగ్గాయి, సిటీలో రోజువారీ కేసుల సంఖ్య ఆదివారం 19,474 నుంచి 13,468కి తగ్గిపోయాయి.
Read Also : Bhavana : ఐదేళ్లు అయింది.. అయినా పోరాడతాను.. లైంగిక వేధింపుల కేసుపై హీరోయిన్ భావన