ఇంకా కన్నీళ్లు తెప్పిస్తానంటోంది : ఉల్లిగడ్డ ధర పైపైకి

ఉల్లిగడ్డ ధరలు పైకే ఎగబాకుతున్నాయి. వంటింట్లో ఇంకా కన్నీళ్లు తెప్పిస్తానంటోంది. ఎందుకంటే..కిలో ఉల్లిగడ్డ ఇప్పటికే రూ. 120 నుంచి రూ. 150 పలుకుతోంది. ఇంకా ధరలు పెరిగే అవకాశాలున్నాయని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. కోల్ కతా మార్కెట్‌లో రూ. 120 ధర పలుకుతుండగా..ఢిల్లీ, ముంబై నగరాల్లో మాత్రం రూ. 120 పలుకుతోంది. ఉల్లిగడ్డల కొరత కారణంగా..ఇతర దేశాల నుంచి ఉల్లిగడ్డలను దిగుమతి చేసుకుంటున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు.
ఇతర దేశాల నుంచి వేయి 160 టన్నుల ఉల్లిగడ్డ దిగుమతి అయ్యిందని, ఇంకా 10 వేల 560 టన్నుల ఉల్లి..మూడు, నాలుగు రోజుల్లో రావాల్సి ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే ఉల్లిపాలయ పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి అవి సరిపోతాయా ? అన్నారు.
* అఫ్ఘనిస్తాన్ నుంచి ఉల్లిపాయల రాక అధికం కాకపోతే..మాత్రం..దేశ రాజధాని ఢిల్లీలో రూ. 200కు చేరుకుంటుందని వ్యవసాయ ఉత్పత్తి మార్కెటింగ్ కమిటీ (APMC) అధికారి తెలిపారు.
* మునుపటి సంవత్సరంతో పోలిస్తే..జూన్ నుంచి జులై ఖరీఫ్ ఉత్పత్తిలో 25 శాతం తగ్గుదల కారణంగా ఉల్లి ధర పెరిగిందని అంచనా వేస్తున్నారు. మట్టిలో తేమ అధిక శాతం ఉన్నందున రైతులు ఉల్లిపాయలను కోయడం మానేశారని అధికారులు పేర్కొంటున్నారు.
* గత కొన్ని వారాల్లో ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నా..ధరలు తగ్గుముఖం మాత్రం పట్టేలేదని వ్యాపారులు వెల్లడిస్తున్నారు. 2015-16లో గణనీయంగా వేయి 987 టన్నుల ఉల్లిపాయలను దిగుమతి చేసుకుంది.