పాకిస్థాన్‌కి మోదీ స్ట్రాంగ్ వార్నింగ్.. ఈ సారి ఇలాచేస్తే ఇక అంతే..

న్యూక్లియర్‌ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడితే సహించేది లేదని తెలిపారు.

పాకిస్థాన్‌కి మోదీ స్ట్రాంగ్ వార్నింగ్.. ఈ సారి ఇలాచేస్తే ఇక అంతే..

Updated On : May 12, 2025 / 9:44 PM IST

పాకిస్థాన్‌కి భారత ప్రధాని నరేంద్ర మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్‌పై జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. రాబోయే రోజుల్లో పాకిస్థాన్‌పై మరింత నిఘా పెడతామని, మరోసారి ఉగ్రదాడి జరిగితే గట్టిగా జవాబిస్తామని తెలిపారు.

“పాకిస్థాన్ న్యూక్లియర్ బెదిరింపులకు భయపడం. మా దృష్టిలో ఉగ్రవాదులు, ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చేవారు ఒకటే. ఉగ్రవాదులు చనిపోతే సైన్యంతో నివాళి అర్పిస్తారా? ఇండియా దెబ్బకు పాక్ భయపడింది. న్యూక్లియర్‌ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడితే సహించేది లేదు.

భారత్‌లోని ప్రజలు, రాజకీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఉగ్రవాదాన్ని ఖండించాయి. మహిళల సిందూరం తుడిచేసే వారికి ఆపరేషన్‌ సిందూర్‌తో బుద్ధి చెప్పాం. ఉగ్రవాదులు కలలో కూడా ఊహించనట్లుగా దాడులు చేశాం. ఇండియన్ మిసైళ్లు, డ్రోన్లు కచ్చితమైన రీతిలో టార్గెట్లను ఛేదించాయి. బహావల్‌పుర్‌, మురుద్కే వంటి ఉగ్రవాదుల క్యాంప్‌లపై దాడి చేశాయి.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉగ్రవాదులకు భారత్‌ గట్టిగా హెచ్చరిక చేసింది. పాకిస్థాన్ గర్వంగా చెప్పుకుంటున్న వారి మిసైళ్లను ధ్వంసం చేశాం. ఆ దేశ విమానాలు గాల్లోకి ఎగరలేని పరిస్థితికి తీసుకొచ్చాం. దీంతో పాకిస్థాన్‌ భయపడి కాల్పుల విరమణ కోసం ప్రపంచం మొత్తాన్ని బతిమిలాడుకుంది. పాకిస్థాన్ డీజీఎంవో కాల్పుల విరమణ కోసం చర్చిస్తామంటూ వచ్చారు” అని చెప్పారు.