ఆవుపేడకు యమ డిమాండ్..100 కిలోల పేడను దొంగిలించారు

  • Published By: madhu ,Published On : August 10, 2020 / 10:52 AM IST
ఆవుపేడకు యమ డిమాండ్..100 కిలోల పేడను దొంగిలించారు

Updated On : August 10, 2020 / 1:03 PM IST

ఛత్తీస్ గఢ్ లో ఆవు పేడకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఏకంగా పేడను దొంగతనం చేసేస్తున్నారు. రైతులు పొగు చేసిన 100 కిలోల ఆవు పేడ చోరీకి గురికావడం సంచలనం రేకేత్తిస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బాగెల్ ఇటీవలే గోధన్ న్యాయ్ యోజన పథకం తీసుకొచ్చారు.



దీని ద్వారా కిలో ఆవు పేడకు రూ. 2 చొప్పున చెల్లిస్తున్నారు. దీంతో పేడకు ఎవరూ ఊహించని విధంగా డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలో దొంగతనాలు జరుగుతున్నాయంటున్నారు.

ఇదిలా ఉంచితే..ఛత్తీస్ గడ్ రాష్ట్రంలోని కొరియా జిల్లాలోని రోజి గ్రామంలో రామ్, సేమ్ లాల్ రైతులు 100 కిలోల పేడను పోగు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి విక్రయించాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ తీరా ఉదయం లేచి చూసే సరికి పేడ కనిపించలేదు.



రైతుల మధ్య వివాదం చెలరేగింది. గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని వారి మధ్య సంధి కుదిర్చారు. కానీ ఎవరు దొంగిలించారనేది తెలియడం లేదు.

రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 05వ తేదీన 46 వేల పశువుల యజమానుల అకౌంట్లో రూ. 1.65 కోట్లను జమ చేసింది. పశువుల పేడ నుంచి ఉత్పత్తులను తయారు చేసే ప్రణాళిక రూపొందించింది.