కేజ్రీవాల్ కు 6కోట్ల లంచం…ఆప్ అభ్యర్థి కుమారుడు సంచలన ఆరోపణలు

  • Published By: venkaiahnaidu ,Published On : May 11, 2019 / 03:18 PM IST
కేజ్రీవాల్ కు 6కోట్ల లంచం…ఆప్ అభ్యర్థి కుమారుడు సంచలన ఆరోపణలు

Updated On : May 11, 2019 / 3:18 PM IST

ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్‌)పై ఓ వ్య‌క్తి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశాడు.ఢిల్లీలోని ఏడు లోక్ సభ స్థానాలకు ఆరోదశలో భాగంగా ఆదివారం(మే-12,2019) పోలింగ్ జరగనుంది.ఈ సమయంలో వెస్ట్ ఢిల్లీ ఎంపీ సీటు కోసం త‌న తండ్రి రూ.6కోట్లను చెల్లించార‌ని.. ఆప్ త‌ర‌ఫున పోటీ చేస్తున్న బ‌ల్బీర్ సింగ్ జ‌ఖార్ త‌న‌యుడు ఉద‌య్ చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌, ఆ పార్టీకి చెందిన నేత గోపాల్ రాయ‌ల్‌ కు త‌న తండ్రి ఆ సొమ్మును చెల్లించార‌ని దీనికి సంబంధించి త‌న దగ్గర ఆధారాలున్నాయ‌ని తెలిపాడు. అన్నా హ‌జారే ఉద్య‌మంలో ఒక్క‌సారి కూడా క‌నిపించ‌డని,మూడు నెలల క్రితమే పార్టీలోచేరిన త‌న తండ్రికి కేజ్రీవాల్ టికెట్ ఎలా ఇచ్చార‌ని మీడియా స‌మావేశంలో ఉదయ్ ప్ర‌శ్నించాడు.