Park with Ashes : కొత్త ఆలోచనతో ముందుకొచ్చిన మధ్యప్రదేశ్.. చితాభస్మంతో పార్కు నిర్మాణం

Park With Ashes
Park with Ashes : దేశంలో కరోనాతో మరణించిన వారు 4 లక్షల మందికి పైగానే ఉన్నారు. వీరిలో చాలామందికి కుటుంబ సభ్యులే దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు దహనం చేసేందుకు ముందుకురాని మృతదేహాలను మాత్రం అధికారులు దహనం చేశారు. ఆలా ఆనందాలుగా దహనమైన వారి చితాభస్మంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం పార్కును నిర్మిస్తుంది. కరోనా రెండో వేవ్ లో మరణించిన వారి చితాభస్మాలను ఇందుకు ఉపయోగించనుంది.
భోపాల్ లోని భద్మద విశ్రామ్ ఘాట్ లో 21 ట్రక్కుల బూడిదను ఉపయోగించి 12 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో పార్కును ఏర్పాటు చేయనున్నారు. ఎంతో మంది కుటుంబ సభ్యులు బూడిద, ఎముకలు వంటివి తీసుకువెళ్లగా ఆరు వేల మంది చితాభస్మాలు ఇక్కడ మిగిలిపోయాయి. వాటితో ఈ పార్కును నిర్మించాలనుకుంటున్నారు.
చాలా మంది వ్యక్తులు మరణించిన తర్వాత వారి చితాభస్మాలను నదుల్లో వదులుతుంటారు. కానీ ఇక్కడ అధికారులు ఆలా చేయలేదు, నదిలో కలిపితే నీరు కలుషితం అవుతుందని భావించి పార్కు ఏర్పాటు చేయాలనీ నిర్ణయించారు.