Pet Dog Attack : అత్యంత భయానకం.. క్రూరమృగంలా మారిన పెంపుడు కుక్క.. ఎంత దారుణంగా దాడి చేసిందో చూడండి..

ఇప్పుడీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వెన్నులో వణుకు పుట్టిస్తోంది.

Pet Dog Attack : అత్యంత భయానకం.. క్రూరమృగంలా మారిన పెంపుడు కుక్క.. ఎంత దారుణంగా దాడి చేసిందో చూడండి..

Updated On : February 15, 2025 / 1:31 AM IST

Pet Dog Attack : వీధి కుక్క అయినా పెంపుడు కుక్క అయినా.. జాగ్రత్తగా ఉండాల్సిందే. లేదంటే ప్రాణాలకే ప్రమాదం అని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. కుక్కు ఏదైనా.. వెరీ డేంజరస్ అని చెప్పక తప్పడం లేదు. పెంపుడు కుక్క అనో, భలే ముద్దుగా ఉందనో.. దాని జోలికి వెళ్లే ప్రయత్నం చేశారో, దాంతో ఆటలు ఆడారో.. మీ సంగతి అంతే.. మీకిక నూకలు చెల్లినట్లే అని చెప్పాల్సి వస్తోంది.

ఓ పెంపుడు కుక్క వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కుక్క కాస్త క్రూరమృగంలా మారిపోయింది. యజమాని అని కూడా చూడకుండా కసిదీరా కరిచింది. అది ఎంత దారుణంగా దాడి చేసిందో చూస్తే వెన్నులో వణుకు పుట్టడం ఖాయం.

అదో పెట్ క్లినిక్. అందులో ఇద్దరు వ్యక్తులు, ఒక పెంపుడు కుక్క ఉన్నాయి. ఇద్దరు వ్యక్తులు సోఫాలో కూర్చుని ఉన్నారు. అందులో ఒక వ్యక్తి డాక్టర్. మరొకరు పెంపుడు కుక్క యజమాని ఉన్నట్లు ఉన్నారు. తొలుత ఆ కుక్క చాలా కూల్ గా కనిపించింది. సోఫాలో కూర్చున్న వ్యక్తి దగ్గరికి వెళ్లింది. అతడు దాన్ని ముద్దు చేశాడు. చేత్తో నిమిరాడు. కాసేపు బాగానే ఉన్న శునకం.. సడెన్ గా వయలంట్ గా మారిపోయింది.

Also Read : పని పని అని పరిగెత్తాడు.. రూ.7.8కోట్ల జీతం కొట్టాడు .. కట్ చేస్తే భార్య వదిలేసింది..

క్రూరమృగంలా మారి భీకర దాడి..
క్రూరమృగాన్ని తలపిస్తూ అత్యంత భయంకరంగా అతడిపై దాడి చేసింది. అతడి చేతిని గట్టిగా పట్టుకుంది. కుక్క నోటి నుంచి చేతిని విడిపించుకునే అతడు తీవ్రంగా శ్రమించాడు. కుక్క మరింత రెచ్చిపోయింది. మరింతగా దాడి చేసింది. చివరికి ఆ వ్యక్తి క్లినిక్ డోర్ తెరిచి కుక్కను బయటకు నెట్టేశాడు. అలా దాని నుంచి తప్పించుకున్నాడు. కుక్క క్రూరమృగంలా మారి దాడి చేయడాన్ని కళ్లారా చూసిన డాక్టర్ భయంతో వణికిపోయాడు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆ రూమ్ నుంచి బయటకు పరుగులు తీశాడు.

వెన్నులో వణుకు పుట్టించే ఘటన..
పెట్ క్లినిక్ లోని సీసీటీవీలో కుక్క దాడి దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఇప్పుడీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అప్పటివరకు కూల్ గా ఉన్న కుక్క అలా వింతగా, భయానకంగా రియాక్ట్ అవడం అందరినీ షాక్ కి గురి చేస్తోంది. దీనిపై నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందించారు. ఆ వ్యక్తి కుక్కను రెచ్చగొట్టి ఉంటాడని, అందుకే అది అలా వైల్డ్ గా రియాక్ట్ అయ్యిందని ఒక నెటిజన్ అభిప్రాయపడ్డాడు. ఆ కుక్క మూతిని ముందు జాగ్రత్తగా లాక్ చేసి ఉండాల్సింది అని మరొకరు అన్నారు.

వీధి కుక్క అయినా, పెంపుడు కుక్క అయినా.. చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే అని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా, ఆ శునకానికి అంత కోపం ఎందుకు వచ్చింది? అది ఎందుకు అంత వైల్డ్ గా రియాక్ట్ అయ్యింది? క్రూరమృగంలా ఎందుకు అటాక్ చేసింది? అనేది అంతుచిక్కడం లేదు.

Also Read : భర్త కాదు సైకో.. ఆ వీడియోలు చూపి అలానే చేయాలంటూ రోజూ టార్చర్.. తట్టుకోలేక భార్య బలవన్మరణం..! పెళ్లైన 11 నెలలకే..

కాగా, కుక్క భయానకంగా దాడి చేసినా.. ఆ వ్యక్తి ధైర్యంగా వ్యవహరించాడు. దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశాడు. కాసేపు నేలపై దాన్ని అదిమిపెట్టాడు. క్లినిక్ డోర్ తీసి బయటకు పంపాలని చూశాడు. కానీ, ఇంతలోనే కుక్క మరోసారి దారుణంగా దాడి చేసింది. అయినప్పటికీ అతడు బెదరలేదు. చివరికి డోర్ ఓపెన్ చేసి దాన్ని బయటకు నెట్టేశాడు. కుక్క దాడిలో అతడి చేతికి తీవ్ర గాయమైనట్లు తెలుస్తోంది. కాగా, అతడి ధైర్యాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.