వారణాశి వదిలేస్తారా : పూరి నుంచి ఎన్నికల బరిలో ప్రధాని?

  • Published By: venkaiahnaidu ,Published On : March 12, 2019 / 09:32 AM IST
వారణాశి వదిలేస్తారా : పూరి నుంచి ఎన్నికల బరిలో ప్రధాని?

2019 సార్వత్రిక ఎన్నికల్లో కూడా మరోసారి ప్రధానమంత్రి నరేంద్రమోడీ యూపీలోని వారణాశి నుంచే బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. వారణాశి నుంచి కాకుండా ఈసారి ఒడిషాలోని పూరి నుంచి మోడీ సార్వత్రిక ఎన్నికల బరిలోకి దిగబోతున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మోడీ మరోసారి వారణాశి నుంచే బరిలోకి దిగుతారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
Read Also : వైసీపీ మమ్మల్ని నిలువునా ముంచేసింది : తిప్పారెడ్డి భార్య

2014 ఎన్నికల్లో వడోదర,వారణాశి నియోజకవర్గాల నుంచి పోటీచేసి గెలిచిన నరేంద్రమోడీ…ఆ తర్వాత వడోదర స్థానానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. గత సార్వత్రిక ఎన్నికల్లో వారణాశిలో కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్, ఆప్ అభ్యర్థిగా బరిలోకి దిగిన కేజ్రీవాల్ ను చిత్తుచిత్తుగా ఓడించి భారీ మెజార్టీ దక్కించుకున్న మోడీ.. ఈ సారి ఎన్నికల్లో కూడా అదే వారణాశి నుంచి బరిలోకి దిగి భారీ మెజార్టీ సాధించాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

అయితే ప్రధాని మాత్రం ఇప్పటికీ తన మనసులోని మాటను బయటపెట్టకుండా సస్పెన్ కొనసాగిస్తూనే ఉన్నారు. ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒడిషా నుంచి బరిలోకి విషయాన్ని దిగబోతున్నారా అన్న ప్రశ్నకు మోడీ సమాధానం దాటవేశారు. దీన్ని బట్టి మోడీ మదిలో పూరి, వారణాశి రెండూ ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also : బాపట్ల వైసీపీలో విభేదాలు : కోన v/s చీరాల గోవర్థన్ రెడ్డి

ఒడిషా రాష్ట్రం నుంచి మోడీ స్వయంగా బరిలోకి దిగితే ఆ రాష్ట్రంలోనే కాకుండా పొరుగు రాష్ట్రాలైన పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్ లలో కూడా బీజేపీకి మంచి మైలేజ్ వస్తుందని, ఇది బీజేపీ బాగా కలిసివచ్చే నిర్ణయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్-11నుంచి సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి.వారణాశిలో మే-19న ఏడో దశలో ఎన్నిక జరుగనుంది. మే-23న ఫలితాలు వెలువడనున్నాయి.
Read Also : ముహూర్తం ఫిక్స్ : వైసీపీని ఓడించటమే లక్ష్యం.. వంగవీటి రాధా