PM Modi: నాలో కొత్త శక్తి వచ్చింది.. చిన్నారులతో ముచ్చటించిన వీడియోను షేర్ చేసిన ప్రధాని మోదీ

చిన్నారులతో కలిసిఉన్న వీడియోను ట్విటర్ లో షేర్ చేసిన మోదీ.. దానికి క్యాప్షన్ ఇచ్చారు. వారణాసిలో పాఠశాల విద్యార్థులతో సంభాషించడం ..

PM Modi: నాలో కొత్త శక్తి వచ్చింది.. చిన్నారులతో ముచ్చటించిన వీడియోను షేర్ చేసిన ప్రధాని మోదీ

PM Modi

Updated On : December 18, 2023 / 1:52 PM IST

PM Modi Interaction With School Children: భారత ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో పర్యటించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం వారణాసిలోని నాడేసర్ లో జరిగిన వికాస్ భారత్ సంకల్ప యాత్రలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ పాఠశాలకు వెళ్లిన మోదీ చిన్నారులతో ముచ్చటించారు. పలు ప్రశ్నలు వేసి చిన్నారుల నుంచి సమాధానాలు రాబట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోను ప్రధాని అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తొలుత మోదీ క్లాస్ రూంలోకి వెళ్లగానే చిన్నారుల మోదీకి అభివాదం చేశారు.

Also Read : TDP vs YCP Leaders : చంద్రబాబు, పవన్ భేటీపై అంబటి రాంబాబు ట్వీట్… స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన టీడీపీ నేత అయ్యన్న

చిన్నారులతో కలిసిఉన్న వీడియోను ట్విటర్ లో షేర్ చేసిన మోదీ.. దానికి క్యాప్షన్ ఇచ్చారు. వారణాసిలో పాఠశాల విద్యార్థులతో సంభాషించడం నాలో కొత్త శక్తిని నింపిందని అన్నారు. పాఠశాలలో సౌకర్యాలు పెరగడంతో ఇప్పుడు చదువునుకూడా ఆస్వాదిస్తున్నామని ఈ ముద్దుగుమ్మలు చెప్పారని మోదీ పేర్కొన్నారు. ఈ వీడియోలో యూపీ సీఎం ఆధిత్యనాథ్ కూడా ఉన్నారు. ప్రధాని మోదీ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మోదీ చిన్నారులతో ముచ్చటించిన తీరునుచూసి నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ప్రధాని మోదీ పిల్లలను ప్రోత్సహించారని ఓ నెటిజన్ పేర్కొనగా.. పిల్లలను కలవడం ద్వారా మోదీ ప్రశంసనీయమైన పని చేశారని పలువురు నెటిజన్లు తమ అభిప్రాయాలను తెలిపారు.