PM Modi In kedarnath : ప్రత్యేక వస్త్రధారణలో కేదారేశ్వరుడికి దర్శించుకున్న ప్రధాని మోడీ ..

ప్రధాని మోడీ ఉత్తరాఖండ్‌ పర్యటనలో కేదార్‌నాథ్‌ ను దర్శించుకున్నారు. ప్రత్యేక వస్త్రధారణలో కేదారేశ్వరుడికి దర్శించుకున్న మోడీ ప్రత్యేక పూజలు చేశారు.

PM Modi In kedarnath : ప్రత్యేక వస్త్రధారణలో కేదారేశ్వరుడికి దర్శించుకున్న ప్రధాని మోడీ ..

pm narendra modi performs puja at the kedarnath

Updated On : October 21, 2022 / 10:34 AM IST

PM Modi In kedarnath : ప్రధాని మోడీ ఉత్తరాఖండ్‌ పర్యటనలో కేదార్‌నాథ్‌ ను దర్శించుకున్నారు. ప్రత్యేక వస్త్రధారణలో కేదారేశ్వరుడికి దర్శించుకున్న మోడీ ప్రత్యేక పూజలు చేశారు. బాబా కేదార్‌కు ఆయన హారతి ఇచ్చారు. ఉదయం 8.30 నిమిషాలకు ఆయన కేదార్‌నాథ్‌ చేరుకున్నారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ప్రత్యేక వస్త్రధారణలో మోదీ ఆలయాన్ని విజిట్ చేశారు.

హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన చంబా మహిళలు చేతితో తయారు చేసిన సంప్రదాయ డ్రెస్సు చోలా దొరను ధరించిన ఆయన ఆలయ దర్శనం చేసుకున్నారు. కేదార్‌నాథ్‌లో ఉన్న ఆది గురువు శంకరాచార్య సమాధిని కూడా మోడీ సందర్శించారు. ఉత్తరాఖండ్‌ లో పలు అభివృద్ధి పనుల్లో భాగంగా ప్రధాని మోడీ గౌరికుండ్‌ నుంచి కేదార్‌నాథ్‌ వరకు రోప్‌వే ప్రాజెక్టుకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే కేదారనాథ్ ను దర్శించుకున్న మోడీ సాయంత్రం బ్రదీనాథ్‌ కూడా వెళ్లనున్నారు. అక్కడ కూడా పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు.