ఆ మాటకు నవ్వు ఆపుకోలేకపోయిన మోడీ,అక్షయ్

  • Published By: venkaiahnaidu ,Published On : April 24, 2019 / 08:21 AM IST
ఆ మాటకు నవ్వు ఆపుకోలేకపోయిన మోడీ,అక్షయ్

Updated On : April 24, 2019 / 8:21 AM IST

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కమార్ తో మంగళవారం(ఏప్రిల్-23,2019)నాన్ పొలిటికల్ ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ తన మనసులోని అభిప్రాయాలను పంచుకున్నారు.మోడీ అక్షల మధ్య జరిగిన ఓ సరదా సన్నివేశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read : బంధాలు,అనుబంధాలు లేవు…అందుకే అమ్మతో ఉండటం లేదు

ఇంటర్వ్యూ సమయంలో అక్షయ్ కుమార్ ప్రధాని మోడీని ఓ ప్రశ్న అడిగారు.దీనికి మోడీ చెప్పిన సమాధానం ఇద్దరి ముఖాల్లో నవ్వులు పూయించింది.కొద్ది సేపు మోడీ,అక్షయ్ తెగ నవ్వుకున్నారు.బీజేపీపై తరచూ ట్వీట్ల రూపంలో సెటైర్లు వేస్తూ ఉండే అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా కూడా మోడీ సమాధానం విని నవ్వుకున్నారు.

ఇంటర్వ్యూ సందర్భంగా సోషల్ మీడియా గురించి అక్షయ్ ప్రస్తావించగా మోడీ సమాధానమిస్తూ…నేను మీ ట్విట్టర్ చూస్తాను. ట్వింకిల్ ఖన్నా గారి ట్విట్టర్ చూస్తాను. ఆమె నన్ను టార్గెట్ చేసే విధానం నుంచి మీ ఫ్యామిలీ లైఫ్ లో ఖచ్చితంగా పీస్ ఉంటుందని అర్థం చేసుకున్నాను అంటూ మోడీ కొద్ది సేపు నవ్వు ఆపుకోలేకపోయారు.అక్షయ్ కూడా నవ్వును ఆపుకోలేకపోయారు.
Also Read : ఆజాద్ ఆప్తమిత్రుడు : మమత కుర్తాలు పంపిస్తారు : అక్షయ్ తో మోడీ చిట్ చాట్

దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా…చాలా సంతోషంగా సానుకూలంగా దృకపధంతో దీన్ని చూస్తున్నాను. నేను ఉన్నానని ప్రధానమంత్రి గుర్తించడం మాత్రమే కాడు నా వర్క్ చదువుతున్నాడు.ధన్యవాదాలు అని ట్వీట్ చేశారు.మంచి రచయిత్రిగా గుర్తింపు పొందిన ట్వింకిల్ ఖన్నాకు హాస్యంతో కూడిన ట్వీట్స్ చేయడంలో మంచి పేరుంది.