అంతరిక్ష యుద్ధానికి భారత్ సిద్ధం : మోడీ సంచలన ప్రకటన

  • Published By: vamsi ,Published On : March 27, 2019 / 07:06 AM IST
అంతరిక్ష యుద్ధానికి భారత్ సిద్ధం : మోడీ సంచలన ప్రకటన

Updated On : March 27, 2019 / 7:06 AM IST

ప్రధాని నరేంద్ర మోడీ సంచలన ప్రకటన చేశారు. అంతరిక్ష యుద్ధం చేయగల సత్తా భారత్ సంపాదించినట్లు ప్రకటించారు. దేశ ప్రజల భద్రత విషయంలో భారత్ మరో ముందడుగు వేసిందని వెల్లడించారు. భారత్ ఇప్పుడు మహాశక్తిగా అవతరించిందని.. శాటిలైట్లను కూల్చగల సామర్ధ్యం సాధించినట్లు ప్రకటించి దేశ ప్రజలను నివ్వెరపరిచారు. 

అంతరిక్ష యుద్ధానికి భారత్ సిద్ధం అని.. ఆ సత్తాను సాధించగలిగిందని ప్రకటించారు. ఇప్పటివరకూ అమెరికా, రష్యా, చైనా దేశాలు మాత్రమే సాధించిన ఘనతను భారత్ కూడా సాధించిందని గర్వంగా ప్రకటించారు ప్రధాని మోడీ. మిషన్ శక్తిలో భాగంగా అంతరిక్షంలో ఓ శాటిలైట్‌ను కూల్చివేశామని.. ఇంత టెక్నాలజీని సాధించిన శాస్త్రవేత్తలను అభినందిస్తున్నట్లు తెలిపారు. ప్రతీ భారతీయుడూ గర్వించదగ్గ అంశంగా అభివర్ణించారు. 
Read Also : బదిలీలపై కోర్టుకు ఏపీ సర్కార్ : మోడీ, షా భయంకర వ్యక్తులు – బాబు

అంతరిక్షంలో.. భూమికి 300 కిలోమీటర్ల ఎత్తులో.. లోయర్ స్పేస్‌లో ఏ-శాట్ (యాంటీ శాటిలైట్)ను మిసైల్ ద్వారా కూల్చివేశారు. కేవలం 3 నిమిషాల వ్యవధిలో మిషన్ శక్తి కంప్లీట్ అయ్యింది. ఈ ఆపరేషన్ విజయవంతం అయిందని, ‘మిషన్ శక్తి’ పేరిట ఇది జరిగిందని తెలిపారు. ఇకపై ఎలాంటి లక్ష్యాన్ని అయినా ఛేదించగల శక్తి ఇండియాకు వచ్చినట్టేనని అన్నారు. స్పేస్ పవర్ దేశాల్లో ఇప్పుడు ఇండియా కూడా సూపర్ పవర్ గా మారిందని మోడీ వ్యాఖ్యానించారు.

Read Also : కష్టాల్లో ఉన్నాడేమో : రూ.40 కోట్లు ఇప్పించండి.. సుప్రీంకోర్టులో ధోనీ