Priyanka Gandhi : ఏంట‌య్యా ఇదీ.. బొకే ఇచ్చారు స‌రే.. మ‌రి పూలు ఎక్క‌డ..?

Priyanka Gandhi hilarious reaction : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌లకు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డింది. ప్ర‌చారం ఊపందుకుంది.

Priyanka Gandhi : ఏంట‌య్యా ఇదీ.. బొకే ఇచ్చారు స‌రే.. మ‌రి పూలు ఎక్క‌డ..?

Priyanka Gandhi hilarious reaction

Updated On : November 7, 2023 / 4:40 PM IST

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌లకు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డింది. ప్ర‌చారం ఊపందుకుంది. అన్ని పార్టీల నాయ‌కులు విజ‌య‌మే ల‌క్ష్యంగా విరామం లేకుండా ప్ర‌చారాన్ని నిర్వ‌హిస్తున్నారు. అటు కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌లు కూడా ఐదు రాష్ట్రాల‌ ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌ల్లో పాల్గొంటున్నారు. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీ నాయ‌కురాలు ప్రియాంక గాంధీకి ఓ వింత అనుభ‌వం ఎదురైంది. ఓ నాయ‌కుడు ఆమెకు బొకే ఇవ్వగా దాన్ని చూసిన ఆమె న‌వ్వ‌కుండా ఉండ‌లేక‌పోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో సోమ‌వారం ప్రియాంక గాంధీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు వేదిక పైకి వ‌చ్చి ప్రియాంక గాంధీని ఒక‌రి త‌రువాత ఒక‌రు వ‌చ్చి క‌లిశారు. ఈ క్ర‌మంలో ఓ నాయ‌కుడు ప్రియాంకను క‌లిసి బొకే అందించారు. దాన్ని చూసిన వెంట‌నే ఆమె తొలుత ఆశ్చ‌ర్య‌పోయింది. త‌రువాత న‌వ్వుకుంది. ఎందుకంటే ఆ బొకేలో పూలు లేక‌పోవ‌డ‌మే దీనికి కార‌ణం.

Also Read: ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేస్తే ఆప్ ఏం చేయనుందంటే…

ఆ త‌రువాత ప్రియాంక గాంధీ స‌ర‌దాగా స‌ద‌రు నేత‌ను ఆట‌ప‌ట్టించారు. ఆ బొకేను చూపిస్తూ పూలు ఎక్క‌డ ఉన్నాయి..? అని ప్ర‌శ్నించారు. దీంతో అక్క‌డ ఒక్క‌సారిగా న‌వ్వులు విర‌బూశాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.