Punjab: పోలీస్ స్టేషన్‭లోనే సర్వీస్ రివాల్వర్‭తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఏఎస్ఐ.. వీడియోలో సీనియర్ అధికారి పేరు

పంజాబ్ అండ్ హర్యానా కోర్టులో రేపు విచారణకు వచ్చే కేసులేంటని అడిగారు. నేను డీల్ చేస్తున్న ఒకే ఒక్క కేసు గురించి ఆయనకు చెప్పాను. అయితే ఇతర అధికారులు విచారిస్తున్న కేసులు సదరు అధికారుల ద్వారా ఆయన దృష్టికి వచ్చాయి. అంతే.. ఇక నాపై మాటల దాడికి దిగారు. చాలా అభ్యంతరకమైన పదజాలంతో నన్ను అవమానపర్చారు. తిట్టడంతోనే ఆపకుండా నాపై రిజిస్టర్ బుక్కులో కంప్టైంట్ కూడా పైల్ చేశారు. అప్పుడే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాను

Punjab: పోలీస్ స్టేషన్‭లోనే సర్వీస్ రివాల్వర్‭తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఏఎస్ఐ.. వీడియోలో సీనియర్ అధికారి పేరు

Punjab Cop Shoots Himself Inside Police Station For Senior Abuse

Updated On : September 10, 2022 / 4:24 PM IST

Punjab: పంజాబ్‭కు చెందిన ఒక అసిస్టెంట్ సబ్ ఇన్‭స్పెక్టర్ తాను పని చేస్తున్న స్టేషన్‭లోనే సర్వీస్ రివాల్వర్‭తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాష్ట్రంలోని హోషియాపూర్‭ పట్టణంలో ఉన్న హరియానా పోలీస్ స్టేషన్‭లో శనివారం ఉదయం జరిగిందీ సంఘటన. ఆత్మహత్యకు ముందు ఆయన ఒక వీడియో విడుదల చేశాడు. ఇందులో తన సీనియర్ పోలీస్ అధికారి తనపై అనుచితంగా మాట్లాడారని, ఆ మాటలు పడటం కంటే చావడమే మంచిదని తాను నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నాడు.

ఆత్మహత్య చేసుకున్న ఏఎస్ఐ పేరు సతీష్ కుమార్. అయితే ఇతడిని తాండా పోలీస్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ ఓంకార్ సింగ్. ఇన్‮‭స్పెక్షన్ సమయంలో సతీష్ తో ఓంకార్ చాలా దురుసుగా మాట్లాడాడట. వీడియోలో సతీష్ మాట్లాడుతూ ‘‘ఇలా నన్ను అవమానించే కంటే ఒకేసారి షూట్ చేయండని ఆయనతో చెప్పాను’’ అని పేర్కొన్నాడు. తాను చెప్పిన సమాధానాలతో ఒంకార్ సింగ్ సంతృప్తి చెందలేదట. అనంతరం తనను చాలా అనుచితంగా, అభ్యంతకరంగా మాట్లాడాడని వాపోయాడు.

‘‘పంజాబ్ అండ్ హర్యానా కోర్టులో రేపు విచారణకు వచ్చే కేసులేంటని అడిగారు. నేను డీల్ చేస్తున్న ఒకే ఒక్క కేసు గురించి ఆయనకు చెప్పాను. అయితే ఇతర అధికారులు విచారిస్తున్న కేసులు సదరు అధికారుల ద్వారా ఆయన దృష్టికి వచ్చాయి. అంతే.. ఇక నాపై మాటల దాడికి దిగారు. చాలా అభ్యంతరకమైన పదజాలంతో నన్ను అవమానపర్చారు. తిట్టడంతోనే ఆపకుండా నాపై రిజిస్టర్ బుక్కులో కంప్టైంట్ కూడా పైల్ చేశారు. అప్పుడే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాను’’ అని వీడియోలో సతీష్ కుమార్ పేర్కొన్నాడు.

ఈ విషయమై జిల్లా సీనియర్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ సర్తాజ్ సింగ్ చాహల్ స్పందించారు. ఎస్‭హెచ్ఓ ఒంకార్ సింగ్‭ను పోలీస్ లైనుకు ట్రాన్స్‭ఫర్ చేయడంతో పాటు అతడిపై విచారణకు ఆదేశించినట్లు పేర్కొన్నారు. అంతే కాకుండా ఏదైనా సమస్య ఎదురైతే తనను సంప్రదించాలని జూనియర్ పోలీసులకు చెప్పినట్లు ఆయన తెలిపారు.

Bharat Jodo Yatra: వివాదాస్పద పాస్టర్‭ను కలుసుకున్న రాహుల్.. తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోన్న బీజేపీ