ఇది మన కలల భారతమా? చిత్రకూట్ గనుల్లో లైంగిక దోపిడీపై రాహుల్ గాంధీ ట్వీట్!

ఉత్తర ప్రదేశ్‌లోని చిత్రకూట్ గనుల్లో మైనర్ బాలికలపై లైంగిక దోపిడీ కేసు విషయంలో ప్రభుత్వ పనితీరును ప్రశ్నించారు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ప్రణాళిక లేని లాక్‌డౌన్‌లో ఆకలితో అమ్మాయిలు భయంకరమైన ధరను చెల్లించారని రాహుల్ చెప్పారు. ఇది మన కలల భారతమా? అంటూ ప్రశ్నించారు.
అక్కడ, పని కావాలంటే పడుకోవాల్సిందే.. యూపీలో లాక్‌డౌన్ దారుణాలు, యథేచ్చగా బాలికల లైంగిక దోపిడీ
పేదరికమే శాపంగా మారిన బాలికలు.. పాఠశాలకు వెళ్లి చదువుకోవాల్సిన వారిని గనుల్లో పనిచేసేలా చేసింది లాక్‌డౌన్. చేసిన పనికి డబ్బులు తీసుకోవాలంటే లైంగిక దోపిడికి గురయ్యేలా చేసింది. ఈ పరిస్థితి వారితల్లిదండ్రులకు కూడా తెలుసు కానీ ఏమీ చేయలేని నిస్సహాయత. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బుందేల్‌ఖండ్ ప్రాంతానికి 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిత్రకూట్‌లో సాగుతోంది ఈ దురాగతం.
ఈ విషయాన్ని ఊటంకిస్తూ ఓ నేషనల్ మీడియా రాసిన కథనాన్ని షేర్ చేసిన రాహుల్ గాంధీ.. ఇది మన కలల భారతమా? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చిత్రకూట్‌లో జరుగుతున్న అఘాయిత్యాలపై ట్వీట్ చేశారు. ప్రణాళిక లేని లాక్‌డౌన్ ఇందుకు కారణం అంటూ విమర్శించారు రాహుల్ గాంధీ.
अनियोजित लॉकडाउन में भूख से मरता परिवार…
इन बच्चियों ने ज़िंदा रहने की ये भयावह क़ीमत चुकाई है।
क्या ये ही हमारे सपनों का भारत है?https://t.co/JGKnU8mdmr
— Rahul Gandhi (@RahulGandhi) July 9, 2020