నిర్భయ దోషులకు ఊరట

నిర్భయ దోషులకు జైలు అధికారులు ఊరట కల్పించారు. వారి కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు పర్మిషన్‌ ఇచ్చారు.

  • Published By: veegamteam ,Published On : January 12, 2020 / 08:34 AM IST
నిర్భయ దోషులకు ఊరట

Updated On : January 12, 2020 / 8:34 AM IST

నిర్భయ దోషులకు జైలు అధికారులు ఊరట కల్పించారు. వారి కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు పర్మిషన్‌ ఇచ్చారు.

నిర్భయ దోషులకు జైలు అధికారులు ఊరట కల్పించారు. వారి కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు పర్మిషన్‌ ఇచ్చారు. మరోవైపు నిర్భయ దోషులు పెట్టుకున్న క్యూరేటివ్‌ పిటిషన్‌పై జనవరి 14న సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. నిర్భయ సామూహిక అత్యాచారం కేసులో నలుగురు దోషులకు డెత్‌ వారెంట్‌ జారీ కావడంతో వారిని జైలుగదుల్లో వేరు వేరుగా ఉంచారు. ఈ నెల 22వ తేదీన ఉదయం 7 గంటలకు ముఖేశ్‌, వినయ్ కుమార్‌, అక్షయ్‌ సింగ్, పవన్‌ గుప్తాలకు ఉరిశిక్ష అమలు చేయనున్నారు.

ఈ నేపథ్యంలో దోషులను కలుసుకునేందుకు వారి కుటుంబాలకు అధికారులు అనుమతించారు. అయితే ఉరి తీసే కొద్ది సమయానికి ముందు మాత్రమే వారు కలుసుకునే అవకాశం ఉంది. నిర్భయ దోషులకు  జైలులో ఇతర ఖైదీల మాదిరిగానే  భోజనం పెడుతున్నారు. తమ ఆస్తి పాస్తులు ఏవైనా ఇతరుల పేర్లపైకి మార్చాలంటే తమకు చెప్పాలని దోషులకు పోలీసులు సూచించారు. దీనిపై వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదని అధికారులు చెప్పారు.

మరోవైపు నిర్భయ కేసులో ఇద్దరు దోషులు పెట్టుకున్న క్యూరేటివ్‌ పిటిషన్‌పై జనవరి 14న సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. దీనిపై జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం మంగళవారం సుప్రీంకోర్టు ఛాంబర్ లో అంతర్గతంగా విచారించనుంది. డెత్‌ వారెంట్‌పై  స్టే విధించి ఉరిశిక్షను జీవితఖైదుగా మార్చాలని ఇద్దరు దోషులు వినయ్‌కుమార్, ముఖేశ్‌ సింగ్ సుప్రీంకోర్టులో క్యూరేటివ్‌ పిటిషన్‌ వేశారు.

రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరించడం, సుప్రీంకోర్టు పునర్విచారణ పిటిషన్‌ కొట్టివేసిన నేపథ్యంలో దోషులకు మిగిలిన చివరి అవకాశమే క్యూరేటివ్‌ పిటిషన్. క్యూరేటివ్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించిన తర్వాత దోషులకు ఎలాంటి న్యాయ సహాయత లభించదు. దీంతో క్యూరేటివ్ పిటిషన్ విచారణపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది.