రిపబ్లిక్ డే ఉత్సవాలు : ఢిల్లీ సిద్ధం

గణతంత్ర దినోత్సవానికి దేశ రాజధాని ఢిల్లీలో ఏర్పాట్లు పూర్తయ్యాయి.

  • Published By: veegamteam ,Published On : January 26, 2019 / 01:48 AM IST
రిపబ్లిక్ డే ఉత్సవాలు : ఢిల్లీ సిద్ధం

Updated On : January 26, 2019 / 1:48 AM IST

గణతంత్ర దినోత్సవానికి దేశ రాజధాని ఢిల్లీలో ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ఢిల్లీ : గణతంత్ర దినోత్సవానికి దేశ రాజధాని ఢిల్లీలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని బాపూజీ ఇతివృత్తంగా వేడుకలు జరపాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ మేరకు ఏర్పాట్లు చేసింది. రాజ్‌పథ్‌లో కాసేపట్లో జరిగే పరేడ్‌ అందరిని ఆకట్టుకోనుంది. ఈ ఏడాది వేడుకలకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రమాపోసా హాజరుకానున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌, ప్రధాని నరేంద్రమోదీ సహా పలువురు ప్రముఖులు, దేశ ప్రజలు పాల్గొనే ఈ కార్యక్రమానికి భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు

రిపబ్లిక్ డే ఉత్సవాల కోసం ఢిల్లీ సిద్ధమైంది. ప్రతి ఏడాదిలా కాకుండా..ఈ సంవత్సరం బాపూజీ 150 జయంతి వేడుకల థీమ్‌తో నిర్వహించడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇప్పటికే గణతంత్రవేడుకల అతిధిగా సౌతాఫ్రికా ప్రెసిడెంట్ సిరిల్ రంపోజా విచ్చేసారు. ఆయనకు ఢిల్లీలో ఘనస్వాగతం లభించింది. రాష్ట్రపతి భవన్‌లో ఆయనకు మన రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ సాదరంగా స్వాగతం పలకగా..సైనిక వందనం స్వీకార కార్యక్రమం జరిగింది. రాజ్‌ఘాట్‌లోని మహాత్మాగాంధీ సమాధిని దర్శించారు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రంపోజా దంపతులు..ఈ సందర్భంగా గాంధీజీ..నెల్సన్ మండేలాని స్మరించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు సిరిల్ రంపోజా చెప్పారు.

ప్రధానమంత్రి జెండా ఎగరేసే..ఎర్రకోటని కూడా జనవరి 26 కోసం భారీగా ముస్తాబు చేశారు. ఎర్రకోట చరిత్ర విషయాన్ని చూస్తే..’ఇలలో స్వర్గం అంటూ ఉంటే అది ఇదే…’ అనే అర్థాన్నిచ్చే వాక్యాలు ఎర్రకోటలోని సభాస్థలి గోడలపై బంగారు అక్షరాలతో మెరుస్తూ కనిపిస్తాయి. పర్షియా కవి అమీర్ ఖుస్రో రాసిన కవితలోని ఈ పంక్తులను అక్కడ చెక్కించింది మొగల్ చక్రవర్తి షాజహాన్. ఎర్రకోట నమూనాను రూపొందించి, దగ్గరుండి కట్టించింది కూడా షాజహానే. ఎర్ర చలువరాతితో అద్భుతంగా నిర్మించిన ఈ కోట వెనుక 360 ఏళ్ల చరిత్ర ఉంది. దీని నిర్మాణాన్ని 1638లో మొదలు పెడితే 1648లో పూర్తయింది. యమునా నది ఒడ్డున, మొత్తం 120 ఎకరాల సువిశాల స్థలంలో ఈ కోటను పర్షియా నుంచి రప్పించిన నిపుణులతో కట్టించారు.

కోటలో చక్రవర్తి సభలు జరిపే మండపాన్ని దివాన్-ఇ-ఆమ్ అంటారు. యాభై అడుగుల పొడవు, 24 అడుగుల వెడల్పుతో ఉండే ఈ సభాస్థలి పైకప్పు, గోడలను వెండి బంగారాలతో తాపడం చేశారు. ఇందులోనే ప్రపంచ ప్రఖ్యాతమైన నెమలి సింహాసనం ఉండేది. మణులు, వజ్రాలను పొదిగి చేసిన దీనిపైనే చక్రవర్తి ఆసీనుడై సభను నడిపేవారంటారు. కోటలోని ఉద్యానవనాలు, పాలరాయి మండపాలు, నీటిని చిమ్మే ఫౌంటెన్లు అద్భుతంగా ఉంటాయి. స్వాతంత్య్ర పోరాటం తర్వాత 1947 ఆగస్టు 15న తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఇక్కడ జెండాను ఎగురవేశారు. అప్పటి నుంచి ఆ సంప్రదాయం కొనసాగుతోంది.దీని ప్రహరీగోడ రెండు కిలోమీటర్ల పొడవుగా, దాదాపు 90 అడుగులకు పైగా ఎత్తుతో ఉంటుంది. ఇందులో ముంతాజ్ మహల్ మ్యూజియం, మోతీమజీద్, రంగ్‌మహల్ ఎంతో ఆకట్టుకుంటాయి. ‘బ్లడ్ పెయింటింగ్స్’ మ్యూజియం, పురావస్తు మ్యూజి

యుద్ధ స్మారక ప్రదర్శన శాలలు కూడా ఎర్రకోటలో ఉన్నాయి. ఈ గణతంత్ర వేడుకలలో పోలీసులకు బహూకరించే పురస్కారాలు 855 కాగా..గాలంటరీ మెడల్స్ 149. పురస్కారాల ప్రదానోత్సవం తర్వాత వివిధ రాష్ట్రాలనుంచి శకటాల ప్రదర్శన, త్రివిధ దళాల విన్యాసాలు పరేడ్‌లో ముఖ్య ఆకర్షణలు. మరోవైపు గణతంత్రవేడుకలలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా భారీ భద్రత ఏర్పాటు చేసారు. అనుమానితులను చెక్ చేస్తూ పోలీసులు పహరా కాస్తున్నారు.